clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

వైఎస్ పంట పండింది!

  శనివారం, మే 16, 2009, 10:17[IST]
YS Rajasekhar Reddy
Vote this article
Up  
Down  


హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్ ఏకైక పెద్ద పార్టీగా ముందుండే అవకాశం కన్పిస్తోంది. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ కు, మహా కూటమికి నువ్వా నేనా అన్నట్టు పోటీ సాగుతోంది. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయిన కాంగ్రెస్ నే రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించే అవకాశముంది. కొద్దో గొప్పో సీట్లు తగ్గినా ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ కు మద్దతు దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. సొంతంగా అయినా 149 మేజిక్ ఫిగర్ ను కాంగ్రెస్ చేరుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన ఎంఐఎంకు ఆరు స్ధానాల వరకు రావచ్చని తొలి ట్రెండ్స్ ను బట్టి తెలుస్తోంది.

వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి సామాన్య ప్రజల్లో వ్యతిరేకత లేదన్న వాస్తవం ఎన్నికల ఫలితాల్లో బయటపడింది. వైఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు మంచి ఫలితాలనే తెచ్చిపెట్టాయి. పావలాకే మహిళలకు రుణాలు, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్యపు పెన్షన్లు, రైతులకు ఉచిత విద్యుత్ తదితర పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఒక రకంగా వైఎస్ పంటపండినట్టే. ఇంతటి పోటీలో ఆయన ఒంటిచేత్తో కాంగ్రెస్ ను విజయతీరాలకు నడిపించారంటే, జనం ఆయన మీద పెట్టుకున్న నమ్మకమే ప్రధాన కారణం. చంద్రబాబు నాయుడు నగదు బదిలీ, ఉచిత కలర్ టీవీల స్కీంలు పెద్దగా పనిచేసినట్టు కన్పించడం లేదు.

వరుసగా ఐదేళ్ళు రుతుపవనాలు బాగా ఉండడం, సరిపడినన్ని వర్షాలు పడడం వైఎస్ కు కలిసొచ్చిన అంశం. చివరి సంవత్సరంలో వర్షాలు సరిగా పడకపోయి ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఇబ్బందుల్లో పడి ఉండేది. వైఎస్ మొదటి నుంచి వరుణ దేవుడిని నమ్ముకున్నారు. వాన దేవుడు తమ కేబినెట్ లో ఉన్నారని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు.

మరోసారి వైఎస్ ముఖ్యమంత్రి కానున్నట్టు కన్పిస్తోంది. తెలంగాణ విషయంలో తాను తీసుకున్న వైఖరి మంచిదేనని ఆయన ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ కు కాలరు ఎగరేసి చెప్పుగల పరిస్ధితి వచ్చింది. వైఎస్ స్ధానంలో బీసీ ముఖ్యమంత్రి అన్న ప్రచారం కూడా ఈ ఫలితాలతో ఎగిరిపోయింది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: కవిత
తేదీ: 21 May 2009 4:53 pm
అసలు వైఎస్సార్ ముందు అవినీతిని అంతం చేస్తే ఇక వైఎస్సేకి తిరుగు లేదు. అంట అవినితిమయంగా ఉంది. అవినీతిని అంతమొందించడంలో యువత సం తీసుకుంటే బాగుంటుంది.

పోస్ట్ చేసినవారు: వై ఎస్
తేదీ: 19 May 2009 12:44 pm
పెద్ద వాళ్ళని గౌరవిచడం నేర్చుకో .

[ Post Comments ]
  Other News
  Videos