clear
clear
clear
clear
x

రోశయ్య మరికొంతకాలం?

  బుదవారం, సెప్టెంబర్ 9, 2009, 15:25[IST]
Rosaiah
Vote this article
Up  
Down  


హైదరాబాద్:ముఖ్యమంత్రిగా కె.రోశయ్యను మరికొంతకాలం కొనసాగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. వైఎస్ తనయుడు జగన్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కూడా ఏకగ్రీవంగా ఆ డిమాండ్ చేశారు. దాదాపు 125 మంది ఎమ్మెల్యేలు వైఎస్ కు అనుకూలంగా సంతకాలు చేశారు.జగన్ కు అనుకూలంగా నిన్న కడపలో పార్టీలకు అతీతంగా పెద్ద ర్యాలీ జరిగింది.

డెబ్బై ఏళ్ళు దాటినా గట్టిగా ఉన్న రోశయ్య భగవద్గీతా వాక్యాలను పాటించే వ్యక్తి. "నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఫలితం గురించి ఆలోచించవద్దు" అనే గీతా వాక్యాన్ని పాటిస్తూ ఎంతో మంది ముఖ్యమంత్రులకు నెంబర్ టూ గా వ్యవహరించిన రోశయ్యకు ఇప్పుడు కాలం కలిసి వచ్చింది. జగన్ కు రాజకీయ అనుభవం లేకపోవడం, ముఖ్యమంత్రి పది కోసం తొందరపడడం మైనస్ పాయింట్లుగా మారాయి. పిసిసి అధ్యక్షుడు డిఎస్ ఎన్నికల్లో ఓడిపోవడం ఆయనకు మైనస్ పాయింట్. కేంద్రమంత్రిగా హాయిగా ఉన్న జైపాల్ రెడ్డికి ముఖ్యమంత్రిగా వచ్చి తలనొప్పులు తెచ్చుకోవలసి అవసరం కన్పించడం లేదు.

ఈ నేపధ్యంలో రోశయ్య ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆర్యవైశ్య సంఘం, వర్తక సంఘాలు రోశయ్యకు మద్దతు ప్రకటిస్తున్నాయి. వారి సహకారం తీసుకుని రోశయ్య నిత్యావసర వస్తువుల ధరలను అదుపులోకి తీసుకువస్తే ఆయనకు మంచి పేరు వస్తుంది. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని జనం అనుకునే పరిస్ధితి వస్తుంది. రోశయ్య తనకున్న ఈ పరపతిని ఉపయోగించి చర్తక సంఘాలను ఒప్పించగలిగితే బాగుంటుంది. కర్నూలు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆర్యవైశ్య నాయకుడు టిజి వెంకటేష్ రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కోరుతున్నారు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: Jagan cashing in on YSR death
తేదీ: 17 Sep 2009 8:20 am
జగన్ గాడే YSR మరణం తరువాత తెగ ఆత్మ హత్యలు చేసుకున్నారు అని, మొత్తం 450 మంది ఆత్మ హత్యలు చేసుకున్నారు అన్ని సాక్షి లో తెగ Hype create చేస్తాడు. ఈ మొత్తం బండారం ఎందుకు చేసాడో mailtoday పత్రిక sept 16th edition లో సంపూర్ణంగా బయట పెటింది. దీన్ని online ( indiatoday and mailtodat*in లో date september 16, 2009 కి మార్చి) లో కూడా చూడవచ్చు. Articles : FAMILIES PAID TO CLAIM YSR SHOCK DEATHS, Jagan cashing in on YSR death hysteria?

పోస్ట్ చేసినవారు: అక్కడ హై కమాండ్
తేదీ: 17 Sep 2009 7:57 am
అక్కడ హై కమాండ్ అని ఒకటి ఉంది, ఎక్ష్త్ర లు చేస్తి ఈ భికారి గల్ల లి సుంటి చేసి పంపిస్తాది సోనియా, ఆ విషయం తెలిసి జగన్ గడు కూడా మూసుకుని కూర్చున్నాడు, లేకపోతె ఎపడి బ్లీడింగ్ స్టార్ట్ అయ్యేది.

[ Post Comments ]
  Other News
  Videos