clear
clear
clear
clear
x

హస్తినకు రాయబారి

  సోమవారం, సెప్టెంబర్ 14, 2009, 16:19[IST]
YS Jagan
Vote this article
Up  
Down  


దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి మరో యత్నం కూడా సాగుతున్నట్లు సమాచారం. లెజిస్లేచర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తే చాలు తామేమిటో నిరూపిస్తామనే ఉద్దేశంతోనే కాంగ్రెసు శాసనసభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ శాసనసభ్యులు జగన్ కు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో బయట పడడానికి అదొకటే మార్గమని అంటున్నారు. పార్టీ శాసనసభ్యుల సంతకాలను తీసుకుని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి పయనం కానున్నట్లు తెలుస్తోంది. శాసనసభ్యుల మనోగతాన్ని అధిష్టాన వర్గానికి వినిపించి సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసేలా చూడడమే ఆయన కర్తవ్యంగా చెబుతున్నారు.

మల్లు భట్టి విక్రమార్క మొదటి నుంచీ దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి పూర్తి అనుయాయిగా పనిచేస్తున్నారు. గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా కూడా మల్లు భట్టి విక్రమార్క చేతనే వైయస్ రాజశేఖర రెడ్డి చక్రం తిప్పించారు. అభివృద్ధి తెలంగాణ కావాలంటూ తెలంగాణ కాంగ్రెసు నాయకులను ఢిల్లీకి తీసికెళ్లింది ఆయనే. వైయస్ మరణం తర్వాత జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ శాసనసభ్యులను, మంత్రులను కూడగట్టి టీవీ చానెళ్ల ముందు వాదనలు వినిపించింది కూడా ఆయనే అనే ప్రచారం సాగుతోంది.

జగన్ ను ముఖ్యమంత్రిని చేయకపోతే తిరుగుబాటు జెండాను ఎగురవేస్తారా అనే అనుమానం కూడా అధిష్ఠాన వర్గానికి ఉన్నట్లు తెలుస్తోంది. మెజారిటీ శాసనసభ్యులు అధిష్ఠాన వర్గంపై తిరుగుబాటు ప్రకటిస్తే కష్టాలు తప్పవు. ఈ మధ్యనే మరో ప్రచారం కూడా ఊపందుకుంది. చిరంజీవి మద్దతుతోనో, కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యుల మద్దతుతోనో పార్టీ అధిష్టాన వర్గం అంగీకరించకపోయినా వైయస్ జగన్ ముఖ్యమంత్రిని చేయాలనే లాబీయింగ్ జరుగుతోందనేది ఆ ప్రచారం సారాంశం.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: శ్రీనివాస్
తేదీ: 15 Oct 2009 3:18 pm
jagaan anna you need not to worry about cm post. andhra people are with you. congress workers are all with you. we dont need oldman as cm. he doesnt have caliber to win as mla. if sonia will not agree come with new party as ysr congress party. people will give you good majority to come to power.ysr with us in everybody hearts in ap.

పోస్ట్ చేసినవారు: TDP voter
తేదీ: 30 Sep 2009 11:59 pm
Some people are criticizing TDP.It is better to keep away from TDP.YSR said TDP is finished otherwise I can Finish it.Within a week he was finished..So bottom line is karma theory is true.So keep away from TDP and try to answer your own party leaders.

[ Post Comments ]
  Other News
  Videos