హైదరాబాద్: చిరంజీవి ఇప్పుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.రాష్ట్ర రాజకీయాల్లో సునామీ సృష్టిస్తుందని భావిం చిన ప్రజారాజ్యం, చివరకు నిరాశాపూరిత ఫలితా లతో చతికిలపడిన వైనం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సహా, గెలిచిన ఎమ్మెల్యేలందరిలోనూ భవిష్యత్తుపై పునరాలోచనలో పడేసింది. పెద్ద పార్టీగా అవతరిస్తుందనుకున్న ఆశలన్నీ ఆవిరయి, చివరకు చిన్నపార్టీగా స్థిరపడటం, అగ్రనేతలంతా పార్టీ నుంచి దూరమవడం ఆందోళన మరింత పెంచింది. ఆ క్రమంలో మొదలైన శాసనసభ సమావేశాలు పీఆర్పీని కాంగ్రెస్‌కు దగ్గర చేశాయి. కాపు మంత్రు లయిన వట్టి వసంతకుమార్, బొత్స సత్యనారాయణ వంటి ప్రముఖులు ముఖ్యమంత్రి, ఆయనను నడిపించే మరో కీలకశక్తి ప్రోత్సాహంతో చిరంజీవి, ఆయనను నడిపించే ‘ఆత్మబంధువు’తో మంతనాలు జరిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించ వద్దని, ఒకవేళ ప్రతిపక్షంగాఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేసినా అది అంతిమంగా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకే లాభం కలుగుతుందని నచ్చచెప్పి, చిరంజీవిని సానుకూలంగా తమ వైపు తిప్పుకోవడంలో విజయం సాధించారు. అంత కంటే ముందే.. పీఆర్పీ ఎమ్మెల్యేలు చాలామంది గెలిచిన వెంటనే వైఎస్‌ను కలిసి, తాము కూడా కాంగ్రెస్‌లో చేరతా మని చెప్పడం, సమయం వచ్చినప్పుడు చూద్దామని ఆయన భరోసా ఇవ్వడంతో పీఆర్పీ మానసికంగా కాంగ్రెస్‌కు చాలారోజుల క్రితమే దగ్గరయినట్టయింది.&13;