clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

కాంతి కోల్పోయిన చంద్రుడు

  శుక్రవారం, జూన్ 19, 2009, 15:47[IST]
Chandrababu Naidu
Vote this article
Up  
Down  


హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దాదాపు మరో ఐదేళ్ళ పాటు లేనట్టే. ఆ తర్వాత కూడా అనుమానాస్పదమే. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైఎస్ కాకుండా మరొకరు ఉండి ఉంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఉండేది. టిడీపిని నమ్ముకున్న కాంట్రాక్టర్లకు, వ్యాపారవేత్తలకు ఇప్పుడు నిరాశే మిగిలింది. వైఎస్ నాయకత్వంలో రెండో విడత గెలుపు వారికి రుచించడం లేదు.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడ్డదారిలో లాభం పొందిన బిల్లీరావు వంటి వారు గోడ మీద పిల్లిలా వ్యవహరించినా వైఎస్ కోటరీ వారిని దగ్గరికి రానివ్వలేదు. వైఎస్ ప్రభుత్వం అవినీతి మయమంటూ చంద్రబాబు నాయుడు స్వయంగాను, తన మీడియా సంస్ధల ద్వారాను ప్రచారం చేసినా జనం పెద్దగా స్పందించలేదు. వైఎస్ సంక్షేమ, అభివృద్ధి పథకాలు జనంలో బాగా పనిచేశాయి. వైఎస్ ఆచరణాత్మకంగా వ్యవహరించగా, చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠం చూపించినట్టు నడుచుకున్నారు. ఈ తేడాను కామన్ సెన్స్ ఉన్న కామన్ ప్రజలందరూ గ్రహించారు.

తెలుగుదేశం పార్టీకి మూలస్తంభంగా ఉన్న ఈనాడు అధినేత రామోజీరావును వ్యూహాత్మకంగా దెబ్బతీయడం ద్వారా ఎన్నికల ముందే వైఎస్ ఉండవల్లి ద్వారా విజయం సాధించారు. ఆంధ్రజ్యోతి మీద కూడా వత్తిడి తేగలిగారు. అన్నిటికంటే మించి కమ్మవారిలో చీలిక తేగలిగారు. చంద్రబాబు నాయుడు తన జీవిత కాలంలో అనుసరించలేని వ్యూహాలు కాంగ్రెస్ లో అమలులోకి వచ్చాయి.

ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మార్చుకోవడం కంటే తమ వ్యాపార వ్యూహాలను మార్చుకుని కాంగ్రెస్ లో ఉన్న కమ్మ నాయకులను పట్టుకుని పనులు చేయించుకోవడమే ఉత్తమమని కొందరు టిడీపి సానుభూతిపరులైన వ్యాపారులు భావిస్తున్నట్టు సమాచారం. అంటే పరిస్ధితి 1982 లో తెలుగుదేశం ఆవిర్భవించక ముందు ఉన్నదన్న మాట. ఆ కాలంలో కమ్మ వ్యాపార, వాణీజ్య వేత్తలకు కాంగ్రెస్ నాయకుల ద్వారానే తమ పనులు చేయించుకునేవారు.

చంద్రబాబు నాయుడు హయాంలో కమ్మ కాంట్రాక్టర్ల కంటే రెడ్లదే పైచేయి అని కమ్మవారి ఆవేదన. బాబు అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి కాంట్రాక్టర్లకు భయపడి కమ్మ వారిని కూడా కాదని టెండర్లను అమోదించేవారని ఒక వాదన. కాంగ్రెస్ హయాంలో ఎటూ రెడ్లదే హవా, తెలుగుదేశంలో కూడా వారిదే అయినప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో మార్పు ఎలా సాధ్యమని కుల సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఇక ముగింపు ఏమిటంటే తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వారు మెల్లగా తమ విధేయతలను అధికార పార్టీ వైపు మళ్ళిస్తున్నారు. సుజన చౌదరి అయినా, బిల్లీ రావు అయినా ఇందుకు మినహాయింపు కాదు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: నిజం
తేదీ: 01 Jul 2009 6:20 pm
మొనార్కిజం కి పెద్ద ఉదాహరణ మన బాబు అందుకే ఇప్పుడు ఇలా వున్నాడు. ఎప్పుడు కింద స్థాయి నుంచి పార్టీ ని బలోపేతం చేయడం లో విపాలముతుంటాడు. రామోజీ ఎంత రాసిన అది జనం నమ్మే స్తితి లో లేరు వారికి ఏమి జరుగుతుందో తెలుసు కాబట్టే తేదేపా ని అధికారం లో కి రాకుండా చేసారు . ఇప్పటికైనా బాబు కళ్ళు తెరచి పార్టి ని కింద స్థాయి నుంచి బలోపేతం చేస్తే ఈ సారి అదికారం లోకి రావచ్చు లేదా మళ్లీ ఇదే రిపీట్ అవుతుంది. అర్ధం లేని వాగ్దానాలను నమ్మే స్తితి లో ప్రజలు లేరని గుర్తుంచుకో.

పోస్ట్ చేసినవారు: mallikarjun
తేదీ: 27 Jun 2009 3:54 pm
ఎస్ యువర్ కరెక్ట్ brother

[ Post Comments ]
  Other News
  Videos