హైదరాబాద్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర ఏదీ లేదని ఢిల్లీలోని విమానయాన వర్గాలు ఒక దక్షిణాది ఆంగ్ల దినపత్రికకు సమాచారం వెల్లడించాయి. సెప్టెంబర్ రెండో తేదీ ఉదయం వాతావరణం మేఘావృతమై ఉంది. ఆ సమయంలో హెలికాప్టర్ రుద్రకోడూరు కొండల మీదుగా వెళ్తోంది. ఈ కొండల్లోనే హెలికాప్టర్ కూలిపోయిన పావురాల గుట్ట ఉంది. హెలికాప్టర్
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌తో కలిసి త్వరలో ఒక క్లాసికల్‌ ఆల్బమ్‌ చేయనున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ తెలిపారు.దివంగత ముఖ్యమంత్రి డా వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి స్మారకార్ధం రెహమాన్‌ ‘జయహో కాన్సర్ట్‌’ పేరుతో ఈ నెల 24న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశం లో ఈ విషయం తెలిపారు.
హైదరాబాదు : మీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి నన్ను పిచ్చోడంటారా? అంటూ కేసీఆర్‌ తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు.అలాగే వరదలు ముమ్మాటికీ మానవ తప్పిదమేనని మరోసారి చెబుతున్నానని, ప్రభుత్వ నిర్లక్ష్యమే వరదలకు కారణమని మరోసారి చెబుతున్నట్లు కేసీఆర్‌ అన్నారు. తప్పులు ఎత్తి చూపితే మతిస్థిమితం లేదంటారా?.. రండి దమ్ముంటే చర్చ పెట్టండి. నిజాలు నిరూపిస్తా... మీడియా ముందు చర్చిద్దాం... అవాకులు
వరంగల్‌ :త్వరలోనే నక్సల్స్ ని పూర్తి స్ధాయిలో అణిచివేస్తామని రాష్ట్ర డీజీపీ గిరీష్‌కుమార్‌ హామీ ఇచ్చారు. అలాగే నక్సల్స్ అణిచివేతకు ప్రత్యేకంగా పక్కా ప్రణాళికలు రచిస్తామని అన్నారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారి వరంగల్‌ రేంజ్‌ పరిధిలో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించేందుకు వరంగల్‌ చేరుకున్నారు. తనను కలిసిన మీడియాతో మాట్లాడారు.
దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రాజశేఖర రెడ్డి పేరుతో పూరీ జగన్నాధ్ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చరిత్రపై 'వై.ఎస్.మహా ప్రస్థానం' టైటిల్ తో మరో చిత్రం తయారుకానుంది. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల(సెప్టెంబర్) 21 వ తేదీన చేవెళ్ళలో ప్రారంభం కానుంది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఔన్నత్యం, పరిపాలన తీరు తదితర విషయాలపై తమ అనుభూతులను అనుభవాలను పంచుకోగోరే వారు తమ కవితలను రాసి పంపితే వాటిని అన్నిటిని కలిపి ఓ బృహత్ సంకలనంగా తీసుకువచ్చే కృషికి చిత్తూరుజిల్లా కుప్పంలోని ద్రవిడ యూనివర్పిటీ శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ గురించి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి నుంచి కవితలను ఆహ్వానించి వచ్చిన
గోపీచంద్..పూరీజగన్నాధ్ కాంబినేషన్లో 'గోలీమార్' అనే చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గోలీమార్' అనే టైటిల్ పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో గోపీచంద్ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఎప్పుడూ బుల్లెట్స్ తో ప్రత్యర్ధులను చంపుతాడు కాబట్టే 'గోలీమార్' అని పెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న
న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనే విషయంపై సీఎల్పీఅభిప్రాయం తీసుకోకుండా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ స్పష్టం చేశారు. సంతాప దినాలు ముగిసేవరకూ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఎవరూ మాట్లాడరాదని ఆయన శనివారం ఇక్కడ ఆదేశించారు. ఏపార్టీ అయినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే స్పందించాల్సి ఉంటుందని ఆయన
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మృతికి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ తన తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది. వైయస్ కుటుంబ సభ్యులకు, సహచరులకు, మిత్రులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ముఖ్యమంత్రితో పాటు మరణించిన మిగతావారికి కూడా తన సంతాపాన్ని వ్యక్తం చేసింది. డాక్టర్ రాజశేఖర రెడ్డి రైతులు, పేద ప్రజల ప్రగతికి
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి భౌతిక కాయాన్ని తొలుత ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు తరలించారు. అక్కడ పార్టీ నేతలు వైయస్ కు నివాళులర్పించారు.ముఖ్యమంత్రి భౌతిక కాయాన్ని చూసి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్ బోరున విలపించారు. తామిద్దరిదీ మంచి జోడీ అని, కాంగ్రెసుకు