హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ డబ్బు మదంతో మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. అవినీతితో సంపాదించిన డబ్బు అహంతో జగన్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ నాన్న వైయస్ రాజశేఖర రెడ్డి కాలి గోటికి
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చెడగొట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైయస్ జగన్ తనపై చేసిన విమర్శలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. పిల్లలను చెడగొట్టవద్దని తాను వైయస్సార్ కు శాసనసభలోనే చెప్పానని ఆయన గుర్తు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట తప్పారని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు మాట మీద నిలబడే నాయకుడు కారని ఆయన అన్నారు. రెండు రూపాయలకు కిలోబియ్యం, మద్య నిషేధం విషయంలో చంద్రబాబు మాట తప్పారని ఆయన అన్నారు. ఆయన రెండో రోజు శనివారం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల
హైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారాల విషయంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య సిగ్గుతో తల వంచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలను ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. అక్రమాలు జరిగాయని కచ్చితంగా తెలిసిన తర్వాత
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దేశ స్థాయి నాయకుడి స్థాయి నుంచి గల్లీ స్థాయి నాయకుడి స్థాయికి దిగజారారని కాంగ్రెసు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గల్లీ గల్లీ తిరుగుతున్నారని, చంద్రబాబు దేశ నాయకుడో, రాష్ట్ర నాయకుడో, గల్లీ నాయకుడో తేల్చుకోవాలని ఆయన శుక్రవారం
హైదరాబాద్: తిరిగి పార్టీలో చేరడానికి ప్రముఖ సినీ నటి రోజాకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి దేవి అడ్డు పడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కాంగ్రెసు తాజా రాజకీయాల నేపథ్యంలో రోజా తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఆమె పార్టీ నాయకులు కె.ఎర్రంనాయుడు, పయ్యావుల కేశవ్, రేవంత్ రెడ్డిల ద్వారా
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ప్రచారం చేపట్టడంపై మాట్లడడానికి తెలుగుదేశం నాయకుడు, సినీ హీరో బాలకృష్ణ నిరాకరించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లోని సైదాబాదులో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం నిర్వహించారు. తొలుత ఆయన భవానీమాత ఆలయంలో పూజలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని గెలిపించి
అనంతపురం: సినీ నటుడు బాలకృష్ణపై గురువారం ధర్మవరం కోర్టు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ కోడ్‌ను ఉల్లంఘించడంపై స్థానిక పోలీసు స్టేషన్‌ లో కేసు నమోదైంది. దీనితో బాలకృష్ణను అరెస్టు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే ఆయన అందుబాటులో లేరని పోలీసులు కోర్టుకు సమాధానం ఇవ్వడంతో
కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మళ్ళీ రామోజీరావుపై యుద్ధం ప్రకటించారు. గతంలో ఆయన మార్గదర్శి ఫైనాన్సియర్స్ అవకతవకలను బయటపెట్టి రామోజీరావు తన సంస్ధలోని కొంత వాటాను కంపానీ గ్రూపునకు అమ్ముకునేలా తీవ్ర వత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. రామోజీరావుపై ఉండవల్లి ఉన్నది వ్యక్తిగత వైరం కాదు, జాతి వైరం. కాపు, బిసి నాయకుడు వంగవీటి రంగా
హైదరాబాద్: నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గుండెల్లో అంత బాధ ఉందా? ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను నర్మ గర్భంగా అంగీకరించారు. పైకి మాత్రం పెద్ద మనిషిగా వ్యవహరించారు. జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ మొదటి భార్య కుమారుడు కాదన్న విషయం తెలిసిందే. కన్నడిగ అయిన మహిళను హరికృష్ణ అనధికారికంగా పెళ్ళాడగా జూనియర్