clear
clear
Search results for "Hyderabad" in Oneindia Telugu
హైదరాబాద్: ప్రాగా టూల్స్‌ కంపెనీ ఉద్యోగిని డంబెల్‌తో మోది దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ప్రాగా టూల్స్‌ కంపెనీలో పనిచేసే బి.వినోద్‌కుమార్‌ (50) హనుమాన్‌పేటలోని రోడ్డు నెంబర్‌ 3లో ఉన్న సుజనమ్మ ఇంట్లో ఐదు నెలలుగా అద్దెకు ఉంటున్నాడు. శనివారం రెండవ

హైదరాబాద్‌: నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై వామపక్షాలు ఆందోళనకు సిద్దమౌతున్నాయి. ఈ ఉదయం మక్ధూం భవన్‌లో సీపీఎం రాష్ట్రకార్యదర్శి బీవీ రాఘవులు, సీపీఐ రాష్ట్రకార్యదర్శి నారాయణ సమావేశమయ్యారు. ధరల పైరుగుదలపై సీపీఐ, సీపీఎం కలిసిపోరాడాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. భవిష్యత్‌లో చేపట్టనున్న ఆందోళనాకార్యక్రమాలపై కూడా సమావేశంలో చర్చించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు నిరసనగా ఏప్రిల్‌ 8న

హైదరాబాద్‌: సరైన నాయకులు లేనందువల్లే తెలంగాణ ఉద్యమం బలహీన పడుతోందని జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ప్రజల్లో ఉద్యమాన్ని బలోపేతం చేయడమే బస్సు యాత్ర లక్ష్యమని ఆయన చెప్పారు. జేఏసీ తలపెట్టిన బస్సు యాత్రను గన్‌పార్క్‌ వద్ద జెండా ఊపి ఆయన ప్రారంభించారు. మూడు రోజుల పాటు సాగే ఈ యాత్ర హన్మకొండ చేరుకోవడంతో ముగుస్తుంది.

హైదరాబాద్‌: ఫ్రీజోన్‌అంశంపై మీడియాలో కొందరు దుర్మార్గంగా వక్రీకరణలకు పాల్పడుతున్నారని తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ మండిపడ్డారు. అవహేళన చేస్తూ, పరమ ఛండాలంగా రాస్తున్నారని ఆరోపించారు. ఫ్రీజోన్‌ వివాదంకారణంగా దక్షిణ తెలంగాణలో ఉద్యమం మొదలైందని ప్రచారం చేస్తున్నారని, అవగాహన లేనివారిని అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. శనివారమిక్కడ పార్టీ కార్యాలయంలో 'వీరతెలంగాణ' మాసపత్రికను కేసీఆర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా

హైదరాబాద్‌: త్వరలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌)తరపున దినపత్రికను ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ప్రకటించారు. శనివారం తెలంగాణ భవన్‌లో 'వీర తెలంగాణ' మాసపత్రికను ఆవిష్కరించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చంద్రశేఖరరావు గతంలో తెలంగాణ టీవీ చానల్ ప్రారంభిస్తానని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ దినపత్రికను దేవులపల్లి అమర్ చాలా ఏళ్ళ నుండి

హైదరాబాద్‌: నెట్ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయి ఫోటోను అసభ్యకరంగా నెట్‌ లో ఉంచిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పెళ్ళికి అంగీకరించలేదంటూ ఓ అమ్మాయి ఫోటోను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసిన రవిశంకర్‌ ను సీఐడీ సైబర్‌ క్రైం పోలీసులు శనివారం అరెస్టుచేశారు. ఈ నీచానికి పాల్పడిన అతన్ని రామాంతపూర్‌లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నెట్‌లో దుష్కృత్యాలకు

హైదరాబాద్‌: జాతీయ ఉపాది హామీ పథకంలో అక్రమాలపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ పథకంలో అక్రమాలు నిరూపించకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సర్కార్‌కు సవాల్‌ విసిరారు. శనివారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు సభ జరిగిన తీరు, స్పీకర్‌ ప్రవర్తన చాలా బాధాకరమన్నారు.

హైదరాబాద్: కొందరు మంత్రులను తాను మందలించినట్లు మీడియాలో వచ్చిన కథనాలను ముఖ్యమంత్రి రోశయ్య శనివారం ఖండించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఏమంత్రిని మందలించలేదని, గత రెండు మూడు రోజులుగా పత్రికల్లో వచ్చిన కథనాలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. కాగా సభలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు తనను ఆవేదనకు గురిచేస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజా

హైదరాబాద్: నెల్లూరులో ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రశ్నాపత్రం లీకేజీ అభియోగాల వ్యవహారంపై విచారణ జరుపుతున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి బలరామయ్య తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ లీకేజీ కుట్రను పోలీసులు భగ్నం చేశారన్నారు. ప్రశ్నాపత్రాలు విద్యార్థులకు ముందుగా చేరలేదని ఆయన అన్నారు. కాగా లీకేజీ విషయమై కృష్ణ చైతన్య కళాశాలపై పూర్తి

హైదరాబాద్‌: నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని శాసనసభ్యుల విజ్ఞప్తిని ముఖ్యమంత్రి రోశయ్య అంగీకరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్నీ శాసనసభ నియోజకవర్గకేంద్రాల్లో శాసనసభ్యుల కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇలా ఉండగా అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. రెండుసార్లు వాయిదా అనంతరం సభ ప్రారంభమైనా ఉపాధి హామీ పథకం అక్రమాలపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. దాంతో

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...