హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఇద్దరు తారలు డైలమాలో పడ్డారు. కాంగ్రెసులో చేరడానికి సిద్ధపడిన విజయశాంతి, రోజా ప్రస్తుతం పునరాలోచనలో పడినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం అనుబంధ మహిళా సంఘం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్న రోజా ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసులో చేరాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేయకపోయినా కాంగ్రెసులో
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్ రెడ్డి ఈ రోజు చేసిన ప్రకటన నెల రోజుల క్రితం చేసి ఉంటే బాగుండేదని కాంగ్రెసు సీనియర్ నేత కె. కేశవరావు అన్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన అనంతరం ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆయన
హైదరాబాద్: దేశంలోనే అతి పొడవైన ఫ్లై ఓవర్ హైదరాబాదులో సోమవారం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం సాయంత్రం దీన్ని ప్రారంభించారు. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని పొడవు 11.6 కిలోమీటర్లు. దాదాపు 36 నెలల పాటు దీన్ని నిర్మించారు. దీని నిర్మాణానికి సుమారు
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌తో కలిసి త్వరలో ఒక క్లాసికల్‌ ఆల్బమ్‌ చేయనున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ తెలిపారు.దివంగత ముఖ్యమంత్రి డా వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి స్మారకార్ధం రెహమాన్‌ ‘జయహో కాన్సర్ట్‌’ పేరుతో ఈ నెల 24న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో సంగీత విభావరి నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశం లో ఈ విషయం తెలిపారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.రోశయ్యకు మంత్రుల నుంచి సహాయ నిరాకరణ ప్రారంభమైంది. చాలా మంది మంత్రులు కార్యాలయాలకు హాజరు కావడం లేదు. ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తున్న సమీక్షా సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. విధులకు హాజరువుతున్న ఒకే ఒక రాజకీయ నాయకుడు కె. రోశయ్య అని, ఈ విధమైన పరిస్థితిని తాను ఎప్పుడూ చూడలేదని, పాలనా యంత్రాంగం
తనపై వస్తున్న వ్యాఖ్యలకు టాలీవుడ్ నటి, తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా తీవ్రంగా కలత చెందుతున్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఆమె రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడింది. దాంతో ఇప్పటికే బాధపడుతున్న ఆమెకు తాజా వ్యాఖ్యలు గోరు చుట్టు మీద రోకటి పోటులా తయారయ్యాయి. రోజాను తెలుగుదేశం వర్గాలు ఐరన్ లెగ్ గా
దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిని చేయాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఒత్తిడి వెనక పెద్ద పారిశ్రామిక లాబీ, రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్నాయి. వైయస్ రాజశేఖర రెడ్డి తొలి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ వ్యక్తిగత కెరీర్ ను పెంచుకుంటూ
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాటు హెలీకాప్టర్ లో వెళ్దాం అనుకున్న ఇద్దరు మంత్రులు, ఆయన సన్నిహితుడు అదృష్టావశాత్తు చివరి నిమిషంలో ప్రాణాలతో బయటపడ్డారు. చిత్తూరు జిల్లాలో సీఎం నిర్వహించబోయే రచ్చబండ కార్యక్రమానికి ఆయనతో పాటు హెలీకాప్టర్ లో వెళ్తానని చిత్తూరు జిల్లాకు చెందిన రోడ్లు, భవనాల శాఖా మంత్రి గల్లా అరుణకుమారి ముఖ్యమంత్రి కార్యాలానికి తెలియజేసారు. మొదట్లో
హైదరాబాద్: కర్నూలు జిల్లాలో కూలిన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ సమాచారాన్ని ఒక్క ఎస్ఎంఎస్ పట్టించింది. విమానం కూలిపోయిన వెంటనే ముఖ్యమంత్రి ప్రధాన భద్రతాధికారి జాన్ వెస్లీ ఆ ఎస్ఎంఎస్ ఇచ్చారు. హెలికాప్టర్ లో ఉన్న వారికి చెందిన ఒకరి సెల్ ఫోన్ నుంచి మెసేజ్ వచ్చినట్లు రాష్ట్ర అధికారులు చెబుతూనే ఉన్నారు. అత్యాధునిక
హైదరాబాద్: హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణిని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అక్కున చేర్చుకుని ఓదార్చారు. వైయస్ కు శ్రద్ధాంజలి ఘటించడానికి సోనియాతో పాటు ప్రధాని మన్మోహన్ సింగ్, పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఉచయం హైదరాబాదుకు చేరుకున్నారు. వారు ముగ్గురు వైయస్ పార్థివ శరీరంపై పుష్పగచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. రాష్ట్ర