హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తాము కాంగ్రెసుతో పొత్తుకు సిద్ధపడినంత మాత్రాన తమ పార్టీ బలహీనపడినట్లు కాదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు ఉత్సాహపడినందుననే తాము కాంగ్రెసు పార్టీతో పొత్తుకు సిద్ధపడ్డామని ఆయన గురువారం చెప్పారు. ఇక నుంచి స్లో అండ్ స్టడీ పద్ధతిలో పార్టీని బలోపేతం చేస్తామని ఆయన చెప్పారు.
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సామాజిక న్యాయ సాధన గోలనే రాజకీయాల్లో వైఫల్యానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. కుల ప్రాతిపదికపై సామాజిక న్యాయాన్ని సాధించాలనే రాజకీయ సూత్రీకరణను అమలు పెట్టడంలో ఆయన విఫలమయ్యారని అంటారు. సైద్ధాంతికంగా అది బాగానే కనిపిస్తున్నా ఆచరణకు వచ్చే సరికి అది ఫలితాలు సాధించడంలో పనికి రావడం లేదని చెబుతారు. అయితే దాన్ని సృజనాత్మకంగా
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం నగరంలో ప్రచారం చేస్తున్న చిరంజీవి కాన్వాయ్ కి విధ్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ఈ సంఘటన మల్కాజిగిరి నియోజకవర్గం సఫిల్ గూడలో గౌతమ్ నగర్ లో చోటుచేసుకున్నట్టు తెలిసింది.
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం పతాక స్ధాయికి చేరింది. అధిక స్ధానాలు సొంతం చేసుకోడానికి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ లో కొంత గంద్రగోళం ఉన్నప్పటికీ మేయర్ పదవి ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఆ పార్టీ పట్టు బిగిస్తోంది. టిడిపి పక్కా ప్రణాళికతో వెళ్తోంది. లోక్ సత్తా, ప్రజారాజ్యం పార్టీలకు గణనీయంగా ఓట్లు వచ్చినా సీట్ల
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర సోమవారం సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల స్టార్ ఆస్పత్రిలో మూత్ర పిండాల వ్యాధికి చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 ఏళ్లు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. విజయవాడ కాంగ్రెసు
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ముత్ర పిండాల వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురై ఆయన హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల స్టార్ ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజులుగా ఆయన చికిత్స పొందుతున్నారు. పర్వతనేని ఉపేంద్ర ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు
హైదరాబాద్: కాంగ్రెసు నాయకులు కెవిపి రామచందర్ రావు, బొత్సా సత్యనారాయణలతో తమ పార్టీ నాయకుడు అల్లు అరవింద్ భేటీ కాకతాళీయమేనని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు స్పష్టం చేశారు. వారు కాకతాళీయంగా మాత్రమే కలిశారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వారంతా హైదరాబాదులోని ఓ హోటల్ లో కాకతాళీయంగా కలవడాన్ని ఆసరాగా తీసుకుని ప్రజారాజ్యం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హామీ ఇచ్చారు. ఆయన శనివారం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ప్రణాళికను విడుదల చేశారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా తాము ఎన్నికలను ప్రణాళికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. మూసీ
హైదరాబాద్: కాంగ్రెసు అవినీతి కూపంగా మారిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెసును ఓడించాలని ఆయన హైదరాబాద్ ప్రజలకు పిలువునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం సాయంత్రం మూసాపేట ర్యాలీలో ప్రసంగించారు. చిన్న పార్టీలకు ఓటేయవద్దని, వాటికి ఓటేస్తే మురిగిపోతాయని ఆయన ప్రజారాజ్యం, లోకసత్తా పార్టీలను
హైదరాబాద్: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఓబుళాపురం గనుల వ్యవహారంపై దర్యాప్తునకు సిబిఐకి అప్పగించాలని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ముఖ్యమంత్రి కె. రోశయ్యను కోరారు. గనులను జాతీయం చేయాలని కూడా ఆయన కోరారు. ఆయన శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసి ఆ మేరకు విజ్ఞప్తి చేశారు. తన సూచనలపై ఆలోచన చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారని, రోశయ్య హామీలో నిజాయితీ కనిపించిందని