హైదరాబాద్‌: వరసకు తనకు మేనల్లుడయిన వైఎస్‌ జగన్‌ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటానని సినీనటుడు డాక్టర్‌ మోహన్‌బాబు అన్నారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని ఆదివారమిక్కడ ప్రైవేట్‌ వార్తా చానల్‌తో మాట్లాడుతూ అన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే తాను రాజకీయాలకు పనికిరానని చెప్పారు. భగవంతుని దయ వల్లే తాను, తన కుటుంబం ఈ స్థితిలో ఉన్నామన్నారు.
హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటమి పాలవుతామనే భయంతోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబుకు 2009 ఎన్నికల్లో ఓటమి అనంతరం అసహనం ఎక్కువైందని అన్నారు. గనులపై ఆరోపణలు వస్తే వాటిని కప్పిబుచ్చేస్థితికి తాను రాలేదని ఆయనన్నారు. తనను అదిరిస్తే,
హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే తెలుగు దేశం పార్టీకి ఒక్క కార్పోరేటర్‌ సీటు ఎక్కువ వచ్చినా రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి రోశయ్య చంద్రబాబుకు సవాల్‌ విసిరారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటమి భయంతోనే చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఒక్క ఆరోపణపై కూడా
కర్నూలు: గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గట్టెక్కాలంటే పీసీసీ చీఫ్‌గా వైఎస్‌ జగన్‌ను ప్రకటించాలని మాజీ మంత్రి మారెప్ప డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్సీ, జడ్పీటీసీలను గెలిపించుకోలేకపోగా, ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన డీ. శ్రీనివాస్‌ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలన్నారు. దివంగత నేత వైఎస్‌
న్యూఢిల్లీ: సోనియాగాంధీని కలిసిన తర్వాత ముఖ్యమంత్రి రోశయ్య మరింత నిబ్బరంగా కన్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తనపై పూర్తి విశ్వాసం ఉంచారని, ఆ విశ్వాసానికి అనుగుణంగా తన పనితీరును నిరూపించుకుంటాననిఆయన చెప్పారు. ఏదో ఒక బలమైన సామాజిక వర్గానికి తాను నాయకుడు కానప్పటికీ తనపై విశ్వాసం ఉంచి పదవి ఇచ్చారని, అందువల్ల అధిష్ఠానం విశ్వాసాన్ని వమ్ము చేయబోనని
హైదరాబాద్: వైఎస్ జగన్ ఢిల్లీలో సోనియా గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఆయన అనుచరులు అనుకున్నవారు వెనకడుగు వేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ భట్టి విక్రమార్కమాట మార్చారు. ఆనం, దానం కామ్ అయిపోయారు. వట్టి వసంత కుమార్ కూడా మాటల మెలికను తన గోదావరి శైలిలో వేశారు. జగన్ కు అనుకూలంగా అంత గట్టిగా మాట్లాడినందుకు
హైదరాబాద్‌: డాక్టర్ వైఎస్‌ రాజశేఖరెడ్డి మరణంపై ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర రావు సంచలన వ్యాఖ్య లు చేశారు. వైఎస్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కొండను ఢీ కొట్టలేదని దానిని కూల్చి వేశారన్నారు. వైఎస్‌ను హతామర్చేందుకు సెక్రటేరి యట్‌లోని కొందరు కుట్ర పన్నార న్నారని ఆరోపించారు. వైఎస్‌ అధికారంలో ఉంటే తమ ఆటలు సాగవని వారు ఈ
హైదరాబాద్: కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రభుత్వ చీఫ్‌విప్‌ మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అధిష్ఠానం ఓ పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుందని, దానికి ప్రతి కాంగ్రెస్‌ నేతా కట్టుబడి ఉంటారని ఆయన చెప్పారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో మల్లు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ జాతీయ పార్టీ
భూమా నాగిరెడ్డి దంపతులు ఇంకా అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. రోజా లాంటి పరిస్ధితే వీరిది. మరో ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధమవుతుండగా, రాజశేఖరరెడ్డి హఠాన్మరణం చెందడం సినిమా కథ అక్కడితో ఆగిపోయింది. అయినా నిన్న భూమా దంపతులు నల్వకాల్వ వద్ద జగన్ కు స్వాగతం పలికి ఆయన ముఖ్యమంత్రి కావాలని
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన బావమరిది, సినీ నటుడు బాలకృష్ణకు షాక్ ఇవ్వబోతున్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను బాలకృష్ణకు అప్పగించాలనే డిమాండ్ పార్టీ కార్యకర్తల నుంచి చాలా కాలంగా వస్తోంది. అయితే దాన్ని చంద్రబాబు మొదటి నుంచి కూడా లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇటీవలి శాసనసభ, లోకసభ ఎన్నికల్లో పార్టీ కోసం బాలకృష్ణ విస్తృతంగా