హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఖనిజ సంపదను పూర్తిగా దోచేస్తున్నారని తెలుగుదేశం సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ రావు ఆరోపించారు. ఓబుళాపురం గనుల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని సుప్రీం సాధికారిక కమిటీ నిర్ధారించినప్పటికీ ముఖ్యమంత్రి రోశయ్య ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. విచారణను సీబీఐకి అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం తగదని ఆయన హితవు పలికారు. అనంతపురం
మహా పర్వతం వంటి చిరంజీవిని ఢీకొంటున్నట్టు వాచకాల ద్వారా ప్రదర్శన ఇస్తున్నా, హీరో రాజశేఖర్, జీవితలకు రాజకీయంగా బ్రేక్ వచ్చే అవకాశాలు కన్పించడం లేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో చిరంజీవి సభలకు రొడ్ షోలకు విపరీతంగా జనం రావడంపై ఆ పుణ్య దంపతులు వ్యాఖ్యానిస్తూ కమెడియన్లు వెళ్ళినా జనం వస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు
విజయవాడ: లయోలా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ బుధవారం విజయవాడ రానున్నారు. దీంతో రాహుల్‌ పర్యటన కోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జెడ్‌ కేటగిరిలో ఉండడంతో ఆయన భద్రత కోసం అధికారులు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమం కోసం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి హామీ ఇచ్చారు. ఆయన శనివారం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం ప్రణాళికను విడుదల చేశారు. పేదలకు, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడమే లక్ష్యంగా తాము ఎన్నికలను ప్రణాళికను రూపొందించినట్లు ఆయన తెలిపారు. మూసీ
హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం వినూత్న ప్రచార వ్యూహంతో ముందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రేటర్‌ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన టీడీపీ అధ్యక్షుడు అనంతరం ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ, "టీడీపీ గెలుపు
విజయవాడ: కృష్ణా జిల్లాలో కమ్మ, కమ్మేతర (నాన్ కమ్మ) రాజకీయాలు మళ్ళీ పుంజుకున్నాయి. యాదవ కులానికి చెందిన పార్ధసారధిని వైయస్ జిల్లాలో ఏకైక మంత్రిని చేశారు. అప్పటి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నేరుగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరోక్షంగా పార్ధ సారధి మీద యుద్ధం ప్రకటించారు. తాజాగా టిడిపి ఎమ్మెల్యే దేవినేని ఉమా మహేశ్వరరావు ఇలా ధ్వజమెత్తారు.
హైదరాబాద్: చిరంజీవికి రాజకీయాలంటే మొహం మొత్తిందా? తాజా వ్యవహారాలను బట్టి అలాగే అనుకోవలసి వస్తోంది. తాను మళ్ళీ నటించాలని చాలా మంది కోరుకుంటున్నారని, సమాజం బాగు కోరే మంచి పాత్ర లభిస్తే మళ్ళీ నటిస్తానేమోనని ఆయన టీవీ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు యత్నాలు బెడిసికొట్టడంతో
హైదరాబాద్‌: రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి దానం నాగేందర్‌ ఈ రోజు మధ్యాహ్నాం ఢిల్లీ వెళ్లనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన అధిష్ఠానానికి వివరణ ఇవ్వనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నిన్న ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గ్రేటర్‌ ఎన్నికల విషయంపై కూడా కాంగ్రెస్ ప్రముఖులతో చర్చించనున్నారు. నిన్న రాజీనామా
హైదరాబాద్‌: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పార్టీ సీనియర్లతో సమావేశమయ్యారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రచారం తదితర అంశాలపై ఆయన చర్చిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల టికెట్లపై కాంగ్రెస్ లో చిచ్చు రేగిన నేపధ్యంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుఖోకపోవడమే మంచిదయిందని ప్రజారాజ్యం సీనియర్ నాయకులు చిరంజీవి ఎదుట తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు
కడప: వైయస్ జగన్‌ పై కొందరు చేస్తున్న దుష్ప్రచారం ఆపకుంటే తగిన గుణపాఠం చెబుతామని రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌ రెడ్డి హెచ్చరించారు. రాయచోటిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైయస్ జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడతారని, మరో పార్టీ స్థాపించనున్నారంటూ కొందరు పని గట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాలను కొట్టిపారేశారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ఆశయ