clear
clear
clear
clear
హోంపేజి » సాహితి » కవిత
కవిత

జ్ఝాపకాలు
వెన్నెల తలగడ మీద ఒరిగి ఏకాంతపుటాలోచనల అరణ్యంలో నన్ను నేను పారేసుకుంటానా - నీ జ్ఞాపకాలు గీరుకుపోయి గాయాలు చేస్తాయి జ్ఞాపకాలు తొలి వానచినుకుల సెంటు పూసుకున్న నేల విరజిమ్ముతున్న వాననై కొత్తగా నేను కొనుక్కున్న పుస్తకపు పేజీ మడతలు వెదజల్లుతున్న వాననై వర్షం కురుస్తున్న సాయం సంధ్యలో స్నానమాడుతున్న అనుభూతై గుండె గొంతుల్లో దిగిపోతాయి...


చినుకులు
వూరు వలస ముల్లెలుగట్టుకొని ఎదురు చూస్తుందివూరి సుట్టు గుట్టలుఆకాశాన చంద్రుడు చుక్కలుచంద్రుడు సిల్లం కల్లమైండాసుక్కలే కుప్ప గూడి ముద్దయినయా...వాగు ఎండు డొక్కయిందిపొంగుతున్న బొగ్గు గనులుఏ బాంచలకు బాంచ చరిత్రలసమాధుల చీకటి పొరలో...గ్రేటర్ పటాల్లో కాట గల్సిన పల్లె పక్షికిపట్నాల సమిటి కొమ్మలుసందు బుట్టనిస్తయాకొండ సుట్టూర బండలుఎన్నడూ నీళ్లకై లేవని ఆవుల మందలుబాల కార్మికులుచెమట చెత్త కుప్పల్లపలిగిపోయినఅక్షరాల పలకలు..


పబ్ పద్యం
ఒక్క విమానమెక్కి దిగుతావు లోతుల్లోకి ఉడుపులెగిపోతాయ్ మెట్లపైకి తోక మొలిచిన దేవుడివై తలువు తెరుస్తావు మైకం రాత్రికి ప్రొజెక్టర్ కన్ను గీటితే కాంతులు చిట్లి రంగులు పగిలి తెర లేవకా, తెర పడకా ఒకటే తూలుడు నిర్విరామ సెల్యులాయిడ్ మాయలోకి డిజె తంతాడు నీ చర్మ వాద్యాన్ని ఎలక్ట్రిక్ కాళ్లతో మూలుగుతాయి కర్ణభేరులు పుచ్చెలు పగులుతాయ్ తలపండు..


వర్షం
- సీతారామశాస్త్రి నా హృదయాకాశంలో అనంతకోటి ఆశల తారకలు తళుక్కు, తళుక్కుమంటుంటే మబ్బు తెరలు ఉరులుగా వాటిని అంతం చేయడానికి నా గుండెలు కప్పేశాయి బాధల వేదనల ఉరుములు, మెరుపులు మబ్బులతో జత కట్టి కుదేసినప్పుడు దుఖ్కం వర్షంగా నా కన్నుల్లోంచి ధారగా కురుస్తోంది..


కర్తవ్యం
నిర్మాణం కష్టంగా తోచటం ప్రాథమిక దశ ఒక తోటను నిర్మించటానికి ఎంత పాటు పడాలి సహనమూ గుండె నిబ్బరమూ సంయమనం వెలుగులో చీకటి దారిని ఛేదించాలి ముండ్ల వనాల్ని పండ్ల వనం చేయాలి ఆచరణలో సానదేలిన వాడెప్పుడూ అజేయుడే..


స్పందించే మనసు
కలిసి నడుద్దాం కొంచెం దూరం మిగిలి ఉంటుంది నీ జ్ఞాపకం గుండెలో దిగులు మోయలేని బరువు దించే వెరుపు లేదు వర్షించే కళ్లు స్పందించే హృదయానికి ఆనవాళ్లు తేలిక పడింది మనసు భారాన్ని కాగితంపై దించాను..


జ్ఞాపకాల గాలివాన
నువ్వూ నేనూ గాలీ వానా కలిసే ఉన్నా గాలి గాలే వాన వానే తడిపో తెరిపో గాలో వానో ఉన్నా లేకున్నా నాకు నువ్వు నీకు నేను జ్ఞాపకాలే..

ఊరు బడి
ఊరు బడి పొద్దున్నే ఒళ్లు విరుచుకుంది లేత కిరణం వెచ్చదనంతో పులకరించింది వెయ్యి రెక్కలను చాచి బాల్యాన్ని అక్కున చేర్చుకుంది స్మృతుల్ని ఏరుకుందామని వెళ్లితే పలకరిస్తుంది అమ్మలా గుర్తు చేస్తుంది కురిపించిన ప్రశ్నల జల్లులను ఒక తరానికి జీవం పోసి కొండలా నిలిచింది నిలబడటం గూర్చి నూరిపోసి విశ్వానికి నమూనాగా..

విత్తనం తండ్లాట...
కలలు కన్నీళ్లుగా మారిన చోట ప్రతి ఉలికిపాటు ఒక ఉద్యమం త్యాగాల నెత్తురులో తడిసిన మట్టి పోరాట విత్తనం కోసం కండ్లను భూమిలో పాతుతుంది భూమిని చీల్చుకుని ఉద్యమాలు మొలకెత్తడం ఇక్కడ అనివార్య రసాయనిక చర్య గడీల మీద వాలిన గబ్బిలం గతాన్నెందుకో నెమరేస్తున్నది రాత్రి చలి మంట కాడ కలిసిన సేతులు బతుకు కొలిమి మంటను..

ఒక ద్రోహపు గాయం
వంచన రగిల్చిన కుంపటి సెగల్లో హృదయాన్ని వేపుకున్నాక గాయాల బాధదేముంది చెప్పు - దేహంలో ప్రవహిస్తున్న మరణం కరాళ నృత్యాన్ని కళ్లారా చూసాక కొత్తగా భయాల బాధేముంది చెప్పు - మనసులు ద్వేషాల పరికి కంపలో చిక్కుకుని చీము రక్తాలు నిండిన పుండైనాక అవమానాల బాధేముంది చెప్పు- మానవీయ బంధాల పూదోటల్ని అంటువెట్టి బూడిద..

More: 1  2  3  4  5  6  7  8  9  10  Next  
  Other News
  Videos