గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పెట్టాలి: విహెచ్హైదరాబాద్: అక్రమ ఖనిజ తవ్వకాలకు పాల్పడిన కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని జైల్లో పెట్టాలని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంత రావు వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డిని సమర్థించే తమ పార్టీ నాయకులను పార్టీ అధిష్టానం సమర్థించబోదని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. గాలి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో ఇష్టారాజ్యంగా...
ముందుగానే అజ్ఞాతంలోకి కెసిఆర్హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఈ నెల 20వ తేదీన ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించనున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు రెండు రోజుల ముందుగా అజ్ఞాతంలోకి వెళ్లే అవకాశం ఉంది. పోలసులు అరెస్టు చేసే అవకాశం ఉండడంతో అజ్ఞాతంలోకి వెళ్లే ఉద్దేశంతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఆమరణ నిరాహార దీక్ష..
వైయస్ జగన్ కు డబ్బు మదం: టిడిపిహైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ డబ్బు మదంతో మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. అవినీతితో సంపాదించిన డబ్బు అహంతో జగన్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తమ నాన్న వైయస్ రాజశేఖర రెడ్డి కాలి గోటికి..
కెసిఆర్ కూతురు కవిత అరెస్టుహైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు కవితను పోలీసులు శనివారంనాడు అరెస్టు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా పాదయాత్ర చేపట్టిన కవితను, మరో 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని మలక్ పేట పోలీసు స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తరగతులు..
జగన్ ను వైయస్సార్ చెడగొట్టారు: బాబుహైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చెడగొట్టారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైయస్ జగన్ తనపై చేసిన విమర్శలపై ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. పిల్లలను చెడగొట్టవద్దని తాను వైయస్సార్ కు శాసనసభలోనే చెప్పానని ఆయన గుర్తు..
వైయస్ కుటుంబానికే పులివెందుల సీటు: డిఎస్హైదరాబాద్: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజకవర్గాన్ని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికే కేటాయించనున్నట్లు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతితో పులివెందుల సీటు ఖాళీ అయింది. ఈ నెల 25వ తేదీన పులివెందుల నియోజకవర్గం ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వచ్చే నెల 19వ..
చంద్రబాబు మాట తప్పారు: జగన్హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట తప్పారని కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ విమర్శించారు. చంద్రబాబు మాట మీద నిలబడే నాయకుడు కారని ఆయన అన్నారు. రెండు రూపాయలకు కిలోబియ్యం, మద్య నిషేధం విషయంలో చంద్రబాబు మాట తప్పారని ఆయన అన్నారు. ఆయన రెండో రోజు శనివారం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల..
సాక్షి బ్లాక్ మెయిల్ చేస్తోంది: బాబుహైదరాబాద్: కర్నాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ వ్యవహారాల విషయంలో ముఖ్యమంత్రి కె.రోశయ్య సిగ్గుతో తల వంచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలను ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరించారు. అక్రమాలు జరిగాయని కచ్చితంగా తెలిసిన తర్వాత..
కాంగ్రెసువి 'గాలి' కబుర్లు: వెంకయ్య నాయుడుహైదరాబాద్: కాంగ్రెసు నాయకులవి గాలి కబుర్లని బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన శుక్రవారం ప్రచారం నిర్వహించారు. కర్నాటకలో రాజకీయ సంక్షోభం నెలకొందని కాంగ్రెసు నాయకులు చేస్తున్న విమర్శలపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు. కర్నాకటలో తాము శాసనసభా పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశామని, దాన్ని బట్టి కర్నాటకలో..
వచ్చే నెల 19న పులివెందుల ఎన్నికన్యూఢిల్లీ: కడప జిల్లా పులివెందుల శాసనసభా నియోజక వర్గం ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణంతో పులివెందులకు ఉప ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నెల 25వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. పోలింగ్ వచ్చే నెల 19వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు 23వ..