సహ నటుడి ప్రాణాలు కాపాడిన సల్మాన్న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన సహనటుడు బన్నీ ఆనంద్ ప్రాణాలను కాపాడారు. విజయ్ గిలానీ వీర్ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. రాజస్థాన్ లో రైలు దోపిడీ దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో సల్మాన్ తో పాటు బన్నీ, విక్కీ మెహ్రా గుర్రాలపై స్వారీ చేస్తున్నారు. రైలు తమ ఎడమ వైపు...
ఎన్నికల తర్వాత ఇడి ముందుకు: కోడారాంచీ: మనీ లాండరింగ్ కేసులో విచారణకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ముందు విచారణకు రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాతనే హాజరవుతానని జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా అన్నారు. తాను హాజరు కావాల్సిన ఒక రోజు ముందు ఈ నెల 18వ తేదీననే ఇడి సమన్లు జారీ చేసిందని, ఆ సమయంలో తాను ప్రచారంలో..
మంత్రుల పనితీరుపై ప్రధాని ఆరాన్యూఢిల్లీ: మంత్రులు తమ పనితీరుపై నివేదికలు సమర్పించాల్సిందిగా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కోరారు. వారి పనితీరును పరిశీలించేందుకు ఆయన ఈ నివేదికలు కోరారు. ఈ నెల 30వ తేదీలోగా మంత్రులు తమ నివేదికలు సమర్పిస్తారని ఒక టీవీ న్యూస్ చానెల్ తెలిపింది. ఈ మేరకు క్యాబినెట్ కార్యదర్శి కెఎం చంద్రశేఖర్ మంత్రులకు లేఖలు రాశారు. ప్రధాని..
మైనింగ్ చిక్కుల్లో గాలి జనార్దన్ రెడ్డిన్యూఢిల్లీ: కర్నాటక బిజెపికి తలనొప్పిగా మారిన ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ నివేదిక సిఫార్సులు ఆయనను ఇరకాటంలో పెడుతున్నాయి. నివేదిక సిఫార్సులు తుది నిర్ణయం కాదని, తాను మైనింగ్ ను ఆపేది లేదని ఆయన పైకి గంభీరంగా కనిపిస్తున్నారు. కానీ కష్టాలు ఆయనను వదిలేట్లు లేవు...
అజర్ పై నిషేధం ఎత్తేయండి: ఎంపీలో కోరికన్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ అజరుద్దీన్ పై విధించిన జీవిత కాలం నిషేధం ఎత్తేయాలనే డిమాండ్ ను కాంగ్రెసు ముందుకు తెస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కున్న అంతర్జాతీయ క్రికెటర్లను తిరిగి తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని వాదిస్తోంది. అజర్ ఇక ఏ మాత్రం క్రికెట్ పోటీల్లో పాల్గొనలేరనే విషయం..
ఇడికి ఆ అధికారం లేదు: మధు కోడారాంచీ: తనకు సమన్లు జారీ చేసే అధికారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు లేదని జార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడా అన్నారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. పార్లమెంటరీ హక్కులను ప్రస్తావిస్తూ పార్లమెంటు సభ్యుడిగా ఏకపక్షంగా ఇడి తనకు సమన్లు జారీ చేయడం సరికాదని, కనీసం 30 రోజుల ముందుగా తనకు నోటీసు..
ముంబై తరహా దాడుల ముప్పు: పిఎంవాషింగ్టన్: ముంబై దాడులు జరిగి ఏడాది గడుస్తున్న సందర్భంగా పాకిస్తాన్ లోని ఉగ్రవాద గ్రూపులు అటువంటి దాడులకు పాల్పడడానికి కుట్ర చేస్తున్నాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా వాడడం విచారకరమని ఆయన అన్నారు. పొరుగు దేశాలపై తమ దేశాన్ని ఉగ్రవాదులు వాడుకునేందుకు వీలు లేకుండా చేసిన తర్వాత పాకిస్తాన్ తో..
చెరుకు ధరపై దద్ధరిల్లిన లోకసభన్యూఢిల్లీ: చెరుకు రైతులకు చెల్లించే ధరపై శుక్రవారంనాడు కూడా లోకసభ దద్ధరిల్లింది. చెరుకు రైతులకు చెల్లించే ధరపై ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను అడ్డుకున్నాయి. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను మధ్యాహ్నానానికి వాయిదా వేశారు. సభ సమావేశం కాగానే ప్రతిపక్షాల సభ్యులు, ముఖ్యంగా బిజెపి సభ్యులు స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు...
మావోల ట్రాక్ పేల్చివేత: ఇద్దరు మృతిరాంచీ: జార్ఖండ్ లోని సింగ్ భూమ్ జిల్లాలో మావోయిస్టులు రైల్వే ట్రాక్ తొలగించడంతో గురువారం రాత్రి టాటా - బిలాస్ పూర్ ప్యాసెంజర్ రైలు ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మరణించగా, 47 మంది గాయపడ్డారు. ఈ రైలుకు 10 కోచ్ లున్నాయని, వాటిలో ఐదు పట్టాలు తప్పగా, మూడు బోల్తా..
చెరుకు ధరపై దద్ధరిల్లిన పార్లమెంటున్యూఢిల్లీ: నూతన చక్కెర ధర విధానానికి వ్యతిరేకంగా గురువారం పార్లమెంటుతో పాటు ఢిల్లీ వీధులు దద్ధరిల్లాయి. ఈ విధానానికి వ్యతిరేకంగా బిజెపి, అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్ఎల్డీ సభ్యులు లోకసభ వెల్ లోకి దూసుకెళ్లి సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే లోకసభలో ఈ దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఆర్డినెన్స్ ను రద్దు..