ముంబై కేసులో ఇటలీలో ఇద్దరు అరెస్టురోమ్: నిరుటి ముంబై దాడుల కేసులో ఇటీలలోని బ్రెస్సియాలో ఇద్దరు పాకిస్తానీలను అరెస్టు చేసినట్లు ఎఎన్ ఎస్ ఎ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వారిద్దరు దాడులకు మద్దతు ఇచ్చినట్లు భావిస్తున్నారు. ముంబై దాడులకు ఈ ఇద్దరు నిధులను పంపడానికి డబ్బుల సరఫరా సంస్థను వాడినట్లు చెబుతున్నారు. దాడులకు పాల్పడినవారితో ఇంటర్నెట్ ఫోన్ ద్వారా సంబంధాలతో డబ్బులు పంపినట్లు...
చైనాలో గనుల్లో పేలుడు: 15 మంది మృతిబీజింగ్: చైనా ఉత్తర ప్రాంతంలో బొగ్గు గనుల్లో శనివారం గ్యాస్ పేలిపోవడంతో 15 మంది మరణించారు. బొగ్గు గనుల శిథిలాల్లో 114 మంది దాకా చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. దాదాపు 399 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ప్రమాదం శనివారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. పేలుడు కారణాలు తెలియరావడం లేదు...
కరాచీలో తాలిబాన్ చీఫ్ ముల్లా ఒమర్వాషింగ్టన్: తాలిబాన్ నేత ముల్లా ఒమర్ పాకిస్తాన్ లోని కరాచీలో ఉన్నట్లు వాషింగ్టన్ టైమ్స్ పత్రిక శుక్రవారం రాసింది. అమెరికా ద్రోణ్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒమర్ ను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ క్వెట్టా నుంచి కరాచీకి రహస్యంగా తరలించినట్లు ఆ పత్రిక తెలిపిది. అమెరికా దాడుల సమయంలో ఒమర్ ఒసామా బిన్ లాడెన్ తో..
పెషావర్ లో ఆత్మాహుతి దాడి: 15 మంది మృతిపెషావర్: పాకిస్తాన్ లోని పెషావర్ ఆత్మాహుతి దాడులతో అట్టుడుకుతూనే ఉన్నది. తాజాగా గురువారం పెషావర్ లోని ఖైబర్ రోడ్డులో జ్యుడిషియల్ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది మరణించగా, 20 మంది దాకా గాయపడ్డారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. జ్యుడిషియల్ కాంప్లెక్స్ ప్రధాన ద్వారం వద్ద పేలుడు..
ఆస్ట్రేలియాలో భారత దంపతులపై దాడిమెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ శివారులో తమపై ముగ్గురు ఆస్ట్రేలియన్లు దాడి చేసినట్లు భారత దంపతులు చెప్పారు. తమపై దాడి చేసినవారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు వారు చెప్పారు. ఇనుప రాడుతో, స్టీల్ చైర్ తో తమను కొట్టినట్లు వారు తెలిపారు. దీన్ని వారు జాతి వివక్ష దాడిగానే చూస్తున్నారు. మెల్బోర్న్ కు 19 కిలోమీటర్ల దూరంలో..
ఇండియన్ పై దాడి: యువకుడికి 18 ఏళ్ల జైలుమెల్బోర్న్: భారత సంతతికి చెందిన వైద్యుడిపై దాడికి గాను ఆస్ట్రేలియాలోని విక్టోరియన్ కోర్టు ఒక యువకుడికి జైలు శిక్ష విధించింది. 20 ఏళ్ల అల్ఫర్ అజోపార్డీకి హైకర్ వాల్ కౌంటీ కోర్టు న్యాయమూర్తి జో గుల్లాసి 18 నెలల జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పినట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి. అతను ముకేష్ హైర్ కెర్వాల్..
బ్రిటిష్ లైబ్రరీలో ఝాన్సీ లక్ష్మీబాయ్ లేఖలండన్: ఈస్టిండియా కంపెనీ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీకి ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ పర్షియన్ భాషలో రాసిన లేఖ లభ్యమైంది. గ్రంధాలయం ఆర్కీవ్స్ లో ఈ లేఖ కనిపించింది. 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి కొద్ది రోజుల ముందు ఆమె ఆ లేఖ రాసింది. బౌవురింగ్ కలెక్షన్ గా చెప్పే డాక్యమెంట్ల సేకరణలో ఈ లేఖ ఒక..
ఎయిర్ ఇండియా అధికారి లైంగిక అత్యాచారంన్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ లో గల జాన్ ఎఫ్ కెన్నెడీ విమానాశ్రయంలో స్థానిక ఎయిర్ లైన్ ఉద్యోగి అయిన మహిళపై ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు లైంగిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానాశ్రయం మేనేజర్ అనిల్ సబర్వాల్ తనపై లైంగిక అత్యాచారానికి పాల్పడినట్లు కరీబియన్ మహిళ స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసింది...
పెషావర్ లో పేలుడు: 6గురు మృతిపెషావర్: పాకిస్తాన్ లో పెషావర్ మిలిటెంట్ల దాడులతో అట్టుడుకుతూనే ఉన్నది. పెషావర్ లోని పోలీసు స్టేషన్ సమీపంలో సోమవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. వారంలో పెషావర్ లో ఇది ఐదో పేలుడు సంఘటన. ఈ ఘటనలో ఆరుగురు మరణించారని, 20 మంది దాకా గాయపడ్డారని పోలీసులు చెప్పారు. పోలీసు స్టేషను..
పెషావర్ లో పేలుడు: 7గురు మృతిపెషావర్: పాకిస్తాన్ లో పెషావర్ పేలుళ్లతో నిత్యం దద్ధరిల్లుతూనే ఉంది. తాజాగా శనివారం సాయంత్రం పేషావర్ లో పేలుడు సంభవించింది. పెషావర్ లోని పుస్కఖరా చౌక్ లో ఈ పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఏడుగురు మరణించినట్లు అనుమానిస్తున్నారు. మృతుల్లో పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. పోలీసు చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు ఈ పేలుడుకు..