కెసిఆర్ అవకాశవాదంపై జూపల్లి విమర్శహైదరాబాద్: వెనుకబాటుతనానికి ప్రాంతాలు కారణం కాదని, ఇందుకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వెనకబడ్డ తెలంగాణ అభివృద్ధికి తమ పార్టీ విశేషకృషి చేస్తోందని అన్నారు. జాగోభాగో అంటూ కొంతమంది నాయకులు ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రేటర్ పరిధిలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ రక్షణ కల్పిస్తుందని...
మావో సాంబశివుడికి గుండెపోటుహైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత సాంబశివుడికి శుక్రవారం గుండెపోటు సంభవించింది. దీనితో చర్లపల్లి జైలు నుంచి సాంబశివుడిని హుటాహుటీన నగరంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తున్నది. సాంబశివుడు చాలా కాలం క్రితం అప్పటి హోం మంత్రి జానారెడ్డి ఎదుట లొంగిపోయాడు. కోనాపురి ఐలయ్య అలియాస్ సాంబశివుడు పోలీసులకు లొంగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే..
రోశయ్య పర్యటనకు ఏర్పాట్లు పూర్తివిశాఖపట్నం: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య ఈ నెల 25, 26 తేదీల్లో విశాఖలో పర్యటించనున్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటిబాలరాజు సూచించారు. గురువారం సాయంత్రం సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రోశయ్య పర్యటన విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యటన ఏర్పాట్లపై..
జయప్రకాష్ ని పొగిడిన జయసుధహైదరాబాద్: కాంగ్రెసు ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ నాయకుడిని ఆరాధించడం గొప్ప విషయమే. తనకు ఎందరో ఫ్యాన్లు ఉన్నారని, తాను మాత్రం లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఫ్యాన్ నని సినీనటి, కాంగ్రెసు ఎమ్మెల్యే జయసుధ చెప్పారు. జయప్రకాష్ నారాయణ రాజకీయ విధానాలను ఆమె తెగ మెచ్చుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెసు తరఫున..
మాస్టారి 'హత్య' పై విద్యార్ధుల ఆగ్రహంఅమలాపురం: ఒక ఉపాధ్యాయుడి కోసం విద్యార్ధులు రోడ్ల మీదికి వచ్చిన సంఘటన ఇది. అల్లవరం రవితేజ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, పేరూరు ఎస్‌బీఎం కాలేజీ అధ్యాపకుడు బళ్ళ రాజవర్ధన్ ది ముమ్మాటికీ హత్యేనంటూ విద్యార్థులు, మృతుని బంధువులు బుధవారం ఆందోళనకు దిగారు. అత్తింటివారే ఆయనను హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థులు వృతదేహాన్ని కదలనీయకుండా ఆందోళన చేశారు. అల్లవరం..
ఒంగోలు గుండ్ల కమ్మ వాగుకు వరద భయంఒంగోలు: గుండ్లకమ్మ ప్రాజెక్టులో నాలుగు గేట్లు ఎత్తివేసి అధికారులు నీటిని కిందకు వదిలేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి ఎగువ నుంచి భారీ స్థాయిలో నీరు వచ్చి చేరింది. ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో 6 వేల క్యూసెక్కులుగా నమోదు కాగా అవుట్‌ఫ్లో 5400 క్యూసెక్కులుగా ఉంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తంగా..
బాలకృష్ణకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్అనంతపురం: సినీ నటుడు బాలకృష్ణపై గురువారం ధర్మవరం కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ కోడ్‌ను ఉల్లంఘించడంపై స్థానిక పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. దీనితో బాలకృష్ణను అరెస్టు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే ఆయన అందుబాటులో లేరని పోలీసులు కోర్టుకు సమాధానం ఇవ్వడంతో..
కడప జిల్లాలో మావోయిస్టు హతంకడప: కడప జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. గాలివీడు మండలం ఉమ్మిగుంట వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య దాదాపు 20 నిమిషాల పాటు ఎదురు కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందినట్లు, సంఘటనా స్థలం నుంచి రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నట్లు..
నూతన జంట ఆత్మహత్య మిస్టరీనందిగామ: వారిద్దరూ కొత్త దంపతులు. వారికి తొమ్మిది నెలల బాబు. ఆర్ధిక ఇబ్బందులు లేవు. కుటుంబ కలహాలు లేవు. అకస్మాత్తుగా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. మనస్తాపానికి గురై చనిపోతున్నామని లేఖ రాసి ఓ యువజంట ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కాండ్రపాడులో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇందూరి నరసింహారెడ్డి(25)..
బాలు గాత్రంతో ఉప్పొంగిన విశాఖ సంద్రంవిశాఖపట్నం: విశాఖనగరం ప్రముఖ సినీ నేపథ్య గాయకులు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం స్వరాభిషేకంతో పులకించిపోయింది. బుధవారం సాయంత్రం ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం స్వరాభిషేకం కార్యక్రమాన్ని విస్టీల్ మహిళా సమితి అధ్యక్షురాలు అనితా బిష్ణోయి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్‌పి శైలజ, గీతామాధురి, కృష్ణచైతన్య, శ్రీకృష్ణ, శృతిల గానామృతంతో ఉక్కు వాసులు పులకించిపోయారు...