clear
clear
clear
clear
x

గ్రేటర్ ప్రజలపై చంద్రబాబు వరాల జల్లు

  శనివారం, నవంబర్ 14, 2009, 17:06[IST]
Chandrababu Naidu
Vote this article
Up  
Down  


హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపిచారు. ఆయన శనివారం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం పార్టీ ప్రణాళికను విడుదల చేశారు. ఇంటింటికీ కృష్ణా జలాలను అందిస్తామని, నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇ - సేవా కేంద్రాల ద్వారా అన్ని సేవల లావాదేవీలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అన్ని ప్రార్థనా మందిరాలకు నీరు ఉచితంగా మంచినీటిని ఇస్తామని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పీఆర్సీ అమలుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్ ను ఆరోగ్య కేంద్రంగా తయారు చేస్తామని, ప్రతి డివిజన్ లో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆయన వాగ్దానం చేశారు.

మంచినీరు, విద్యుత్ 24 గంటలు అందిస్తామని ఆయన చెప్పారు. సెటిలర్లకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. మహానగర శివార ప్రాంతాల ప్రజల కోసం పరిపాలన వికేంద్రీకరణ చేస్తామని అన్నారు. టీవీ, సినిమా కళారంగాలకు చెందినవారందరికీ గుర్తింపు కార్డులు, 50 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎడ్యుకేషనల్, టూరిజం, మెడికల్ హబ్ లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వంద కోట్ల రూపాయలతో మైనారిటీ సంక్షేమ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన ఐటి ఉద్యోగులకు లోన్ పేమెంట్ హాలీడే ఇస్తామని చెప్పారు. తోపుడు బండ్ల లైసెన్స్లులు రద్దు చేస్తామని, రోడ్లను విశాలం చేస్తామని చెప్పారు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: బాబు లుచ్చగాడు
తేదీ: 14 Nov 2009 6:16 pm
యేరు దాటిన తరువాత తెప్ప తగలేసే ఈ లుచ్చా న కొడుకు మాటలు నమ్మకండి.వీడి ఈ ఎలేచ్షన్స్ లో కూడా వొడఇంచ్ బుడ్డి cheppandi

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...