clear
clear
clear
clear
x

వైయస్ జగన్ ఢిల్లీ యాత్ర, ప్రాధాన్యత

  శనివారం, నవంబర్ 7, 2009, 12:51[IST]
YS Jagan
Vote this article
Up  
Down  


బెంగుళూరు: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి తనయుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం బెంగుళూరు నుంచి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఆయనతో పాటు తల్లి విజయలక్ష్మి, సోదరి షర్మిలాలు కూడా వెళ్ళినట్లు తెలుస్తోంది.

శనివారం సాయంత్రం నాలుగు గంటలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ జగన్‌కు అపాయింట్‌ మెంట్‌ ఇచ్చారు. వీరి సమావేశంలో ముఖ్యంగా పులివెందుల టిక్కెట్‌, తర్వాత కేంద్రంలోగాని, రాష్ట్రంలోగాని జగన్‌కు తగిన ప్రాధాన్యపై చర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలియవచ్చింది.

జగన్ కు కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇవ్వడానికి సోనియా గాంధీ సిద్ధమైనా, ఆ పదవి తీసుకోడానికి జగన్ తటపటాయిస్తున్నారు. కేంద్రంలో కేబినెట్ ర్యాంక్ పదవి కావాలని ఆయన వర్గం పట్టుబడుతోంది. లేదంటే పులివెందుల అసెంబ్లీ టికెట్ తీసుకుని పిసిసి అధ్యక్ష పదవి తీసుకోవాలని వైయస్ జగన్ ఆశిస్తున్నారు. ఈ ఆప్షన్లపై సోనియా గాంధీ నేడు ఆయనకు ఏదో ఒకటి తేల్చుకోమని చెప్పే అవకాశముంది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: కిరణ్
తేదీ: 13 Nov 2009 2:16 pm
రామోజీ రావు సీఎం అయితే బాగుంటుదని

పోస్ట్ చేసినవారు: సామాన్యుడు
తేదీ: 07 Nov 2009 8:45 pm
రాష్ట్ర కాంగ్రెస్స్ అధ్యక్ష పదవి అయితే భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్య మంత్రి పదవి గురించి మార్గం సుగమం అవుతాది.

[ Post Comments ]
  Other News
  Videos