న్యూఢిల్లీ: కర్ణాటకలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెర పడిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప అన్నారు. తమ పార్టీలో తలెత్తిన సంక్షోభం సమసిపోయింద ని జమ్మూలోని వైష్ణోదేవి ఆలయానికి బయలుదేరేముందు శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. తనపై నమ్మకం ఉంచినందుకు సహచర సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కర్ణాటకలో నాయకత్వ మార్పునకు గాలి జనార్దరెడ్డి సోదరుల నేతృత్వంలోని అసమ్మతి వర్గం పట్టుబట్టిన నేపథ్యంలో సమస్య పరిష్కారానికి అధిష్టానం జోక్యం చేసుకున్న సంగతి విదితమే. మరో వైపు గాలి జనార్ధనరెడ్డి పట్టు బిగించినట్టే కన్పిస్తోంది. ఆయన హైదరాబాద్ లో పెట్టిన క్యాంపులో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు చెబుతున్నారు.
మరిన్ని వివరములు:
సంబంధిత వార్తలు