హైదరాబాదు: టిక్కెట్ల అంశాన్ని రాజకీయం చేయొద్దని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలను, నేతలను కోరారు. కోరినవారందరికీ టికెట్లు ఇవ్వలేమని, అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే టిక్కెట్లిచ్చామని డిఎస్ అన్నారు. గ్రేటర్ అభ్యర్థుల జాబితా విషయంలో ఎమ్మెల్యేలందరూ సంతృప్తిగా ఉన్నారని, ఎవరో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ నిన్న తనపై ఆరోపణలు చేసిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. అంతమాత్రాన తాను టిక్కెట్లు అమ్ముకున్నట్లా? అన్ని ప్రశ్నించారు.
టిక్కెట్లు అమ్ముకున్నానని ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యేల్లో ఒకరు అసలు ఈ ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తని డిఎస్ అన్నారు. ఉన్నది 150 సీట్లేనని, కావాలన్న వారందరికీ టెక్కెట్లు ఇవ్వటం సాధ్యపడదని, ఏ పార్టీ జాబితా ప్రకటించినా అసంతృప్తులు, బుజ్జగింపులు, ఆందోళనలు సహజమేనని డిఎస్ అన్నారు.
మరిన్ని వివరములు:
శ్రీనివాస్
గ్రేటర్ హైదరాబాద్
కాంగ్రెస్
సంబంధిత వార్తలు