హైదరాబాద్: ఓబుళాపురం గనులపై మరో విడత పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఓబుళాపురం అక్రమాలపై పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడాన్ని టిడిపి తప్పుపట్టింది. ఓబుళాపురం అక్రమాలపై సమగ్ర విచారణ జరిపే వరకూ తమ పోరాటం ఆగదని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో నాగం జనార్థన్ రెడ్డి స్పష్టం చేశారు.
నిబంధనలను ఉల్లంఘించి ఖనిజాలను రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసి) అక్రమాలపై ప్రభుత్వంలోని ఒక వర్గం కళ్లుమూసుకుని వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓబుళాపురం గనుల్లో అక్రమ తవ్వకాలపై రీ సర్వే చేయించాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించినా ఫలితం లేకపోవడం గమనార్హం. అక్రమ తవ్వకాల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. ఇప్పటిదాకా దాదాపు రెండువేల కోట్లకు పైగా విలువైన ఖనిజాన్ని ఓఎంసీ అక్రమంగా తవ్వితీసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మరిన్ని వివరములు:
తెలుగుదేశం
చంద్రబాబు నాయుడు
హైదరాబాద్
సంబంధిత వార్తలు