clear
clear
clear
clear
x

జూనియర్ డాక్టర్ల సమ్మె హెచ్చరిక

  శనివారం, నవంబర్ 7, 2009, 16:33[IST]
Jr Doctors
Vote this article
Up  
Down  


హైదరాబాద్: స్టైఫండ్ పెంచాలని డిమాండ్‌ చేస్తూ జూనియర్‌ డాక్టర్లు (జూడాలు)రాష్ట్రవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. మూడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగుతామని ఆరోగ్యశాఖ కార్యదర్శి సత్యనారాయణకు నోటీసులు అందజేశారు. అక్టోబరు 2 నుంచే శాంతియుతంగా ఆరోగ్యశ్రీ విధులను బహిష్కరించిన జూడాలు ఇక పూర్తిస్థాయి సమ్మెకు దిగి తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకుంటామని చెప్పారు.

బోధనాస్పత్రుల్లో జాతీయస్థాయిలో సగటున 30 వేల చొప్పున స్త్టెఫండ్‌ అందిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 8 వేలు మాత్రమే అందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో తొమ్మిదేళ్లుగా శాంతియుతంగా పోరాటం చేశామని, ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్ల సమ్మెకు దిగకతప్పలేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికే పలుసార్లు కమిటీలు వేశారని వాటి సిఫార్సులకు అనుగుణంగా నడుచుకోవడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీకోసం 930 కోట్లు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం పూర్తిగా ఆరోగ్యశ్రీ విధులను నిర్వర్తిస్తున్న తమకు 30 కోట్ల రూపాయలు కేటాయించలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  Other News
  Videos