హైదరాబాద్: ప్రజారాజ్యం అదినేత చిరంజీవి వరద బాధితుల కోసం విశాఖలో జోలె పట్టిన విషయం తెలిసిందే. చిరంజీవి గతనెల విశాఖపట్నంలో జోలెపట్టి సేకరించిన విరాళాల మొత్తం 32 లక్షల 48 వేల 654 రూపాయలని ప్రజారాజ్యం నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు సైతం తమ కిడ్డీ బ్యాంకుల నుంచి డబ్బు తెచ్చిచ్చారని చెప్తూ వరదబాధితులను ఆదుకోవడానికి విరాళాలు అందించినవారందరికీ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ డబ్బును ఇవాళ సాయంత్రం జరిగే సినీ తారల స్టార్‌నైట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రికి అందజేస్తామని చిరంజీవి చెప్పారు. మగధీర సినిమా ఒకరోజు కలెక్షన్లను కూడా ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ అందజేయనున్నారని చెప్పారు.
మరిన్ని వివరములు:
చిరంజీవి
ప్రజారాజ్యం
అల్లు అరవింద్
సంబంధిత వార్తలు