clear
clear
clear
clear
x

వర్షాలకు తమిళనాడులో 14 మంది మృతి

  శనివారం, నవంబర్ 7, 2009, 13:29[IST]
Chennai
Vote this article
Up  
Down  


చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు రాష్ట్రంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని వల్ల అనేక చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అకాల వర్షాలకు తమిళనాడు రాష్ట్రంలో సుమారు 14మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

అల్ప పీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో కూడా ఉంది. నెల్లూరు జిల్లాలో గత అయిదు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా కైవల్య నది పొంగి పోర్లుతోంది. జిల్లాలో రెండు హాస్టల్ భవనాలు వానల కారణంగా నేలకూలాయి.

కావలి డీవిజన్ లో వానల వల్ల ఎక్కువ నష్టం జరిగింది. పిల్లివాగు, చిప్పలేరు వాగు పొంగటంతో కావలి డివిజన్‌లోని నాలుగు గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్లు ప్రాంతాలలోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. అల్లూరు-కావలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  Other News
  Videos