హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు టికెట్లు అమ్ముకున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నివాసం ఎదుట అర్ధనగ్న పదర్శన చేపట్టారు. డీఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, ఎంపీ సర్వే సత్యనారాయణ, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోస్తు ఏర్పాటు చేశారు.
ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ వెళ్తున్న సమయంలో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ లో కలకలం చర్చనీయాంశమైంది. దానం నాగేందర్ కేవలం రోశయ్యను ఇబ్బంది పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డి శ్రీనివాస్ ను ఈ విషయంలో సోనియా గాంధీ సంప్రదించే అవకాశముంది.
మరిన్ని వివరములు:
దానం నాగేందర్
శ్రీనివాస్
కాంగ్రెస్
సంబంధిత వార్తలు