కర్నూలు: కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో గల శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పూర్వు పీఠాధిపతి సుశమీంద్ర తీర్ధుల పార్ధివ దేహాన్ని బుధవారం వెలికితీశారు. ఖననం చేసిన ఆరు నెలల తర్వాత ఈ భౌతిక కాయాన్ని వెలికి తీశారు. కళాకర్షణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి శ్రీమఠం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా సుశమీంద్రుల ఫార్థివ శరీరాన్ని వెలికి తీశారు. సుశమీంద్రుల స్వామి పార్థివ దేహాన్ని సందర్శించేందుకు పెద్ద యెత్తున భక్తుల తరలి వచ్చారు.
సుశమీంద్ర స్వామి పార్థివ దేహాన్ని తర్వాత తిరిగి ఖననం చేస్తారు. మతాచారం ప్రకారం శరీరం కుళ్లిపోయిందా లేదా అని చూస్తామని కళాకర్షణ నిర్వాహకులు చెప్పారు. దీనిపై తప్పొప్పులకు తావు లేదని అన్నారు. సుశమీంద్ర తీర్థులు గత ఏప్రిల్ లో మరణించారు. బృందావనస్తులైన ఆరు నెలల తర్వాత ఆయన శక్తిని కలశంలో ఉంచిన పవిత్ర తుంగభద్ర జలంలోకి ఆవాహన చేస్తారు. ఆ కలశాన్ని ఆరు నెలల పాటు మరో చోట ఉంచి పూజిస్తారు. ఈలోగా మండపం సమాధిపై బృందావనం ఏర్పాటు చేస్తారు.
మరిన్ని వివరములు:
సంబంధిత వార్తలు