clear
clear
clear
clear
x

జగన్ పేరుతో రోశయ్యకు ఆటంకం: పాల్వాయి

  బుదవారం, నవంబర్ 4, 2009, 19:05[IST]
Pallwai Govardhan Reddy
Vote this article
Up  
Down  


న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పేరు చెప్పి కొంత మంది మంత్రులు, శాసనసభ్యులు ముఖ్యమంత్రి కె. రోశయ్య పాలనకు ఆటంకం కలిగిస్తున్నారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారంనాడు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు అంతా తెలుసునని, తాను రోజువారీ నివేదిక తెప్పించుకుంటున్నానని, ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు అది చేస్తానని సోనియా తనతో అన్నట్లు ఆయన తెలిపారు.

రోశయ్య పాలన బాగా ఉందని, సోనియా సహకారం లభిస్తే మరింత మెరుగ్గా పాలన అందిస్తారని ఆయన చెప్పారు. కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ రోశయ్య మంచి పాలన అందిస్తున్నారని ఆయన చెప్పారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెసు విజయం సాధించినందుకు అభినందించడానికి తాను సోనియాను కలిసినట్లు ఆయన తెలిపారు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: AP మాన్
తేదీ: 05 Nov 2009 2:46 pm
వొకసారి రాజీవ్ గాంధీ మన సిటీ లో ఏదో గల్లి కి వొచ్చినపుడు రాత్రి కి రాత్రే రోడ్డును వేయించిండ్రు . మరి వర్షాలు పోయి గిన్ని రోజులైనా నో ప్రొగ్రెస్స్ ???పైసలు లేవా మేము అంటే ప్రజలం బిక్షం ఇస్తాం /

పోస్ట్ చేసినవారు: రోశయ్యకా దోస్త్
తేదీ: 05 Nov 2009 2:41 pm
రోశయ్య చెప్పినాక కూడా రోడ్ల గురించి ఆ మంత్రి (వాణి పేరు తెలియదు ...సారీ )కూడా పట్టించ్చుకోవడంలేదు

[ Post Comments ]
  Other News
  Videos