న్యూఢిల్లీ: వందే మాతర గీతాలాపనపై జమైత్ ఉలేమా - ఎ - హింద్ ఫత్వా జారీ చేసినట్లు వచ్చిన వార్తలను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఖండించారు. తన సమక్షంలో ఆ సంస్థ తన సర్వసభ్య సమావేశంలో ఆ మేరకు ఏ విధమైన తీర్మానం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. చిదంబరం ఆ సమావేశంలో నవంబర్ 3వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నారని, ఆయన మాట్లాడుతున్నప్పుడు అటువంటి ఫత్వా జారీ చేసినట్లు ఆయనకు తెలియదని చిదంబరం సహాయకుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిదంబరం ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగ పాఠాన్ని చదివారని, దాని నుంచి విడిగా మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. చిదంబరం సమక్షంలో జమైత్ వందే మాతరం గీతాన్ని ఆలపించకూడదని బిజెపి నాయకులు చేసిన విమర్సకు వివరణ ఇస్తూ ఆ ప్రకటన వెలువడింది.
మరిన్ని వివరములు:
వందేమాతరం
చిదంబరం
న్యూ ఢిల్లీ
సంబంధిత వార్తలు