ముంబై: వచ్చే 48 గంటల్లో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను కాంగ్రెసు, ఎన్సీపి వేగవంతం చేయాలని గవర్నర్ ఎస్సీ జమీర్ చేసిన వ్యాఖ్య నేపథ్యంలో ఆయన బుధవారం ఆ హామీ ఇచ్చారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ కాంగ్రెసు, ఎన్సీపిలకు సూచించారు.
24 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి, శివసేన ప్రతినిధి బృందం బుధవారం గవర్నర్ ను కలిసి కోరారు. మంత్రిత్వ శాఖలు, మంత్రి పదవులపై కాంగ్రెసు, ఎన్సీపిల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కి రాకపోవడంతో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువు దీరడంలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెసు, ఎన్సీపిల మధ్య తాజా చర్చలు ప్రారంభమయ్యాయి.
మరిన్ని వివరములు:
అశోక్ చవాన్
కాంగ్రెసు
ఎన్సీపి
సంబంధిత వార్తలు