న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కొడాకు, అతని అనుచరులకు విచారణ నిమిత్తం ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ సమన్లు జారీ చేసింది. హవాలా లావాదేవీలపై, ఇన్వెస్ట్ మెంట్లపై ఇడి వారిని ప్రశ్నించనుంది. అనారోగ్య కారణంతో చికిత్స పొందుతున్న మధు కొడాకు అస్పత్రిలోనే సమన్లు అందజేశారు. రక్తంపోటు, కడుపు నొప్పులతో ఆయన రాంచీలోని ఆస్పత్రిలో చేరారు.
అతని అనుచరులు ఏడుగురికి కూడా ఇడి నోటీసులు జారీ చేసింది.సోదాల్లో బయటపడిన పత్రాలను పరిశీలించడంలో ఆదాయం పన్ను శాఖ, ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంటు నిమగ్నమయ్యాయి. కొడా, అతని అనుచరులు దాదాపు 2 వేల కోట్ల రూపాయల మేరకు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారని తెలియజేసే పత్రాలు అవి. విదేశాల్లో కొడా, అతని అనుచరులు పెట్టిన పెట్టుబడులపై, చేసిన కొనుగోళ్లపై ఇడి దృష్టి పెట్టింది.
మరిన్ని వివరములు:
మధు కొడా
జార్ఖండ్
న్యూఢిల్లీ
సంబంధిత వార్తలు