హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి మారెప్పపై కాంగ్రెసు పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. పిసిసి అధ్యక్షుడు శ్రీనివాస్ పై ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ మారెప్పపై చర్యలు తీసుకోవాలని పార్టీ హై కమాండ్ ఆదేశించింది. దీంతో పార్టీ క్రమ శిక్షణా సంఘం మారెప్పకు షోకాజ్ నోటీసు జారీ అవకాశం ఉంది.
డి. శ్రీనివాస్ టికెట్లు అమ్ముకున్నారని మారెప్ప విమర్శించారు. కులం వల్లనే ప్రజారాజ్యం పార్టీతో పొత్తు శ్రీనివాస్ ప్రయత్నించారని కూడా ఆయన అన్నారు. పార్టీని భ్రష్టుపట్టిస్తున్న శ్రీనివాస్ ను పిసిసి అధ్యక్షుడిగా తొలగించి వైయస్ జగన్ ను నియమించాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు. డి. శ్రీనివాస్ ఆస్తులపై విచారణ జరిపించాలని కూడా ఆయన కోరారు.
మరిన్ని వివరములు:
కాంగ్రెసు
అధిష్టానం
డి శ్రీనివాస్
సంబంధిత వార్తలు