clear
clear
clear
clear
x

మీడియా అతి చరుగ్గా ఉండొద్దు: రోశయ్య

  మంగళవారం, నవంబర్ 3, 2009, 15:06[IST]
Rosaiah
Vote this article
Up  
Down  


హైదరాబాద్: మీడియా చురుగ్గా ఉండాలని, అయితే అతి చురుకుదనం పనికి రాదని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. విషయంలో వార్త వేరు, వార్తావ్యాఖ్య వేరని, మీడియాలో పోటీ వల్ల వార్తకు, వ్యాఖ్యానానికి మధ్య తేడా లేకుండా పోయిందని ఆయన అన్నారు. హైదరాబాదులోని బాగ్ లింగంపల్లిలో గల ఆర్టీసి కళాభవన్ లో మంగళవారం జరిగిన ఎపి వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య సభలో ఆయన మాట్లాడారు. సమాజంలో మాదిరిగానే జర్నలిజంలోనూ మార్పులు వస్తున్నాయని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ముందుంటుందని ఆయన హామీ ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి వారు పని చేస్తున్న యాజమాన్యాలే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. జర్నలిస్టుల న్యాయమైన కోరికల పరిష్కారానికి యాజమాన్యం ముందుకు రావాలని ఆయన సూచించారు. ఎపి వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య కార్యాలయం విషయాన్ని పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చారు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: surya
తేదీ: 04 Nov 2009 12:22 pm
రోశయ్య గారు మీ మాట కరెక్ట్, జర్నాలిసం విలువలు రోజు రోజు కు దిగజారి పోతునాయ, ఇపుడు అంత ఎల్లో జర్నాలిసం మే వుంది

[ Post Comments ]
  Other News
  Videos