హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కాలిగోటికి సరిపోరని తెలుగుదేశం నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఫ్రీజోన్ పై కెసిఆర్ చంద్రబాబుపై చేసిన విమర్శలను ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. కెసిఆర్ ను ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెసుకు చేరువయ్యే ఉద్దేశంతోనే కెసిఆర్ తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై విమర్సలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మహబూబ్ నగర్ పార్లమెంటు సీటులో తమ మద్దతుతోనే కెసిఆర్ గెలిచారని, అందువల్ల కెసిఆర్ రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని ఆయన అన్నారు. కెసిఆర్ కు రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆయన అన్నారు. రాజకీయ భవిష్యత్తు లేదని గ్రహించే హైదరాబాద్ ఫ్రీజోన్ వ్యవహారంపై కెసిఆర్ రాద్ధాంతం చేస్తున్నారని ఆయన అన్నారు. ఫ్రీజోన్ వ్యవహారంపై కెసిఆర్ తెలియకుండా అర్థరహితమైన విమర్శుల చేస్తున్నారని వేణుగోపాలాచారి అన్నారు.
మరిన్ని వివరములు:
తెలుగుదేశం
కె చంద్రశేఖర రావు
నాగం జనార్దన్ రెడ్డి
Related news