clear
clear
clear
clear
x

బాణాసంచా గోదాంలో ప్రమాదం: 32 మంది మృతి

  శనివారం, అక్టోబర్ 17, 2009, 8:42[IST]
Fire
Vote this article
Up  
Down  


చెన్నై: తమిళనాడులోని పల్లిపట్టులోని బాణాసంచా గోదాంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 32 మంది సజీవ దహనమయ్యారు. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది తెలుగువారే. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అది రైస్ మిల్లులో పెట్టిన హోల్ సేల్ బాణాసంచా విక్రయ దుకాణమని పోలీసు వర్గాలు చెప్పాయి.

శిథిలాల కింది నుంచి 30 మృతదేహాలను వెలికి తీశారు. వాటిని తిరుత్తాని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీపావళి పర్వదినం కావడంతో వాటిని కొనడానికి పెద్ద యెత్తున రావడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. మృతుల్లో 29 మంది ఆంధ్రులని, ముగ్గురు తమిళనాడుకు చెందినవారని సమాచారం.



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...