తేరుకుంటున్న కర్నూలు, మంత్రాలయం
శనివారం, అక్టోబర్ 3, 2009, 10:49[IST]
హైదరాబాద్: కర్నూలు, మంత్రాలయాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. 24 గంటల పాటు వరద నీటిలో చిక్కుకున్న ఈ రెండు ప్రాంతాల్లో వరద నీరు శనివారం ఉదయానికి కాస్తా తగ్గాయి. మంత్రాలయం, కర్నూలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే. అయితే కర్నూలు జిల్లాలోని నంద్యాలకు వరద ముప్పు పొంచి ఉంది. కాగ్నానది పొంగిపొర్లుతోంది. కర్నూలులో రెండు అడుగుల మేర నీరు తగ్గినట్లు సమాచారం. మహబూబ్ నగర్ లో కూడా పరిస్థితి మెరుగుపడుతోందని ముఖ్యమంత్రి కె.రోశయ్య చెప్పారు. సహాయ చర్యలు చేపట్టడానికి పరిస్థితి అనుకూలంగా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. కర్నూలులో ప్రజలు సురక్షితంగా ఉన్నారని ఆయన చెప్పారు. రాత్రంతా సచివాలయంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించిన ఆయన శనివారం ఉదయం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మరిన్ని వివరములు:
వర్షాలు
వరద బాధితులు
కర్నూలు
Related news