clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

మమతతో ఎంపీల మొక్కుబడి భేటీ

  మంగళవారం, జూలై 7, 2009, 14:48[IST]
Mamata Banerjee
Vote this article
Up  
Down  


న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఏదో విధంగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రైల్వే మంత్రి మమతా బెనర్జీని కలిసి వినతిపత్రం సమర్పించారు. సోమవారం అప్పాయింట్ మెంట్ ఇచ్చినా ఎందుకు రాలేదని మమతా వారిపై తొలుత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు కలవడం సాధ్యం కాదని ఆమె చెప్పారు. అయితే మమత అప్పాయింట్ మెంటు ఇవ్వలేదనే వార్తలు రావడంతో కాంగ్రెసు ఎంపీలు పార్లమెంటు లాబీలో ఆమెను కలిసి వినతిపత్రం సమర్పించారు. వారికి ఆమె ఈ విధమైన హామీ ఇవ్వలేదు. ఆమెతో చర్చించడానికి వారికి అవకాశం చిక్కలేదు.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను కలవడానికి రైల్వే మంత్రి మమతా బెనర్జీ మంగళవారం తొలుత నిరాకరించారు. రైల్వే బడ్జెట్ లో తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు వెళ్లిన వారికి ఆమె వద్ద చుక్కెదురైంది. సోమవారంనాడు ఎందుకు రాలేదని ఆమె కాంగ్రెస్ ఎంపీలను అడిగారు. చివరకు మొక్కుబడిగా వారు మమతా బెనర్జీకి రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై వినతిపత్రం సమర్పించారు. ఇదిలా ఉంటే, కాంగ్రెసు ఎంపీల కన్వీనర్ గా పొన్నం ప్రభాకర్ ఎన్నికయ్యారు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోకసభ స్థానం నుంచి విజయం సాధించారు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: Dikshit
తేదీ: 07 Jul 2009 7:11 pm
తెలుగులో మంచి పదాలున్నాయి. వెధవలు, చవటలు, సన్నాసులు, దద్దమ్మలు వగైరా. వాళ్ళను ధిల్లీ పంపిన వాళ్ళని ఏమనాలి?

పోస్ట్ చేసినవారు: bsk
తేదీ: 07 Jul 2009 7:05 pm
ఈ వెర్రి పూలని ఎవరు కలుస్తారు వీళ్ళ వోట్లు గవర్నమెంట్ ఉండడానికి కావలి బడ్జెట్ ఫండ్స్ మటుకు తమిళ్ నాడు బెంగాల్ బీహార్ బుధి సిగ్గు లజ్జ ఉన్న వాడేవాడు ఇంకొక సారి కాంగ్రెస్ కి వోట్ veyyakoodadhu

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...