clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్

  శనివారం, మే 16, 2009, 13:46[IST]
Vote this article
Up  
Down  


హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బాటలో నడిచిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఓటమిని రుచి చూస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సహా మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. శాసనసభ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం విషయంలో ముఖ్యమంత్రి మాటే తన మాటగా పలుకుతూ వచ్చిన మంత్రి టి.జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమణ చేతిలో ఓడిపోయారు. మంత్రి షబ్బీర్ అలీ కూడా ఓటమిని చవి చూడక తప్పలేదు. కరీంనగర్ లోకసభ స్థానంలో మాజీ మంత్రి ఎం.సత్యానారాయణ రావు అనుచరుడు పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. పోటీకి దూరంగా ఉండి ముఖ్యమంత్రి తెలంగాణ వైఖరిని సత్యనారాయణరావు వీలు చిక్కినప్పుడల్లా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ నుంచి బలమైన కాంగ్రెసు నాయకులెవరూ గెలిచే పరిస్థితి లేదు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: నిజమ్
తేదీ: 16 May 2009 11:46 pm
తెలంగాణ అంటే ఏమిటి? దీనికీ సమాధానం మరో ఐదు కాలాలు వేచి చూడ వలసిందే.... ఈ లోపల ????????????????? రాస్తే బాగోదు......

పోస్ట్ చేసినవారు: nagaraju
తేదీ: 16 May 2009 8:51 pm
వైయస్ రాజశేఖర రెడ్డితెలంగాణా పర్జ్ లకు మ్మోసంమ్కాసిడు ఆంధ్ర పర్జలకు రాకాగోతిండు తెలంగాణాబెస్ట్ జై తెలంగాణా ఆంధ్ర హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బాటలో నడిచిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఓటమిని రుచి చూస్తున్నారు వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణాబెస్ట్ కాంగ్రెసు ఓటమి బాటలో నడిచినవైయస్ జై తెలంగాణా hyderabad జైఆంధ్ర kadapa

[ Post Comments ]
  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...