హైదరాబాద్: ద్రవ్యోల్బణం పెరుగుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేసేదేమీ లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి కె. రోశయ్య అన్నారు. ద్రవ్యోల్బణం అదుపునకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదల అందరికీ ఆందోళన కలిగించే విషయమేనని ఆయన అన్నారు. కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటాయని ఆయన అన్నారు.
ఎన్నికలు జరిగితే ద్రవ్యోల్బణం తగ్గుతుందనే అభిప్రాయంతో బిజెపి నాయకులున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పనితీరును ఒక అంశంపై నిర్ధారించలేమని, ఏదో ఒక అంశాన్ని తీసుకుని ప్రభుత్వం విఫలమైందని చెప్పలేమని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మేరు పర్వతంలాంటివారని, తాను మూషికం లాంటివాడినని, తనకూ చంద్రబాబుకు మధ్య పోలికేమిటని ఆయన అన్నారు. చంద్రబాబు తెలివిలో ఏ కొంచెం తెలివి తనకున్నా ముఖ్యమంత్రులను పడగొట్టి తాను ముఖ్యమంత్రిని అయి ఉండేవాడినని ఆయన వ్యాఖ్యానించారు.
మరిన్ని వివరములు:
rosaiah bjp ఎదురులేని వైఎస్గవర్నర్ చెప్పినవి నిజాలే: రోశయ్యసత్యంపై సిగ్గుపడుతున్నా: రోశయ్యబడ్జెట్ పై విపక్షాల పెదవి విరుపుగుర్తు ఏదైనా..గెలుపే:చిరు ధీమామెడ నరుక్కుంటా గాని..కేసీఆర్ సత్యాగ్రహమే ఎజెండా:దత్తాత్రేయషబ్బీర్‌అలీ ఐఎస్‌ఐ ఏజంటే: ఇంద్రసేనారెడ్డి Related newsమేటాస్ తో ఒప్పందాలను వెల్లడిస్తాం:రోశయ్య ఒమర్ అబుల్లాకే సిఎం అవకాశం