clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

యుపిఎ పూర్తి కాలం ఉంటుంది: కారత్

  శుక్రవారం, జూన్ 20, 2008, 17:13[IST]
Vote this article
Up  
Down  


న్యూఢిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) ప్రభుత్వం పూర్తి కాలం మనుగడ సాగిస్తుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందంపై ప్రభుత్వం పడిపోవచ్చుననే వార్తల నేపథ్యంలో ఆయన శుక్రవారం ఆ విధంగా అన్నారు. యుపిఎ అనేది ఒకే అంశానికి చెందిన ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. విద్య వ్యాపారంగా మారడంపై ఆయన ఆయన ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో మాట్లాడారు. ఈ విధానంపై ఎస్ ఎఫ్ ఐ వంటి విద్యార్థి సంఘాలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందని ఆశిస్తున్నామని, అందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. అమెరికాతో అణు ఒప్పందాన్ని ప్రభుత్వం అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ముందు పెట్టవచ్చునని, దాంతో వామపక్షాలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటాయని, అప్పుడు ప్రభుత్వం పడిపోతుందని వచ్చిన వార్తలో నేపథ్యంలో కారత్ ఆ విధంగా అనడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రభుత్వం తన వాగ్దానాలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.


upa prakash karat america ఇదే హీన ప్రభుత్వం: అద్వానీవైఎస్ ను తెగ మెచ్చుకున్న సోనియాటిటిడి చైర్మన్ కు చిరు తీర్ధం?మన్మోహనే మా ప్రధాని అభ్యర్ధి: సోనియాతెలంగాణపై వైఖరి అదే: కారత్బాబుతో కలిసి ప్రభుత్వం: కారత్చంద్రబాబుతో కారత్ భేటీచంద్రబాబుకు కారత్ ఫోన్'కింగ్'కి కీళ్ళ నొప్పులా!?రాజు లేఖలో పొలిటీషియన్ల పేర్లు?అమెరికాలో సంక్రాంతి సంబరాలుఒబామా ప్రమాణ స్వీకారం నేడే Related newsకేంద్రానికి కరుణానిధి మొట్టికాయ కాంగ్రెస్ మద్దతు కోరుతాం: కారత్మైకేల్ జాక్సన్‌కు తప్పని మరణం
User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...
  వీడియోస్
  మరిన్ని వార్తలు