clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

ద్రవ్యోల్బణం: 13 ఏళ్ల గరిష్ట స్థాయి

  శుక్రవారం, జూన్ 20, 2008, 15:05[IST]
న్యూఢిల్లీ: ఇంధన ధరల పెంపు ప్రభావంతో ద్రవ్యోల్బణం తాజాగా 13 ఏళ్ల గరిష్ట స్థాయిని చేరుకుంది. జూన్ 7తో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం 11.05 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం గత 17 వారాల నుంచి అంతకంతకు పెరుగుతున్న విషయం తెలిసిందే.  ద్రవ్యోల్బణానికి తాజాగా ఇంధనం, విద్యుత్, ల్యూబ్రికాంట్స్ ధరలు మరింత ఆజ్యం పోశాయి. ఈ వారంలో ఇంధనం, విద్యుత్, ల్యూబ్రికెంట్ల ధరలు 7.8 శాతం పెరగ్గా, ఇతర సరుకుల ధరలు 1.8 శాతం పెరిగాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యల్లో భాగంగా వడ్డీ రేట్లపై ఒత్తిడి తెచ్చేందుకు రిజర్వు బ్యాంకు ఇటీవల రెపో రేటును 0.25 శాతం పెంచి 8 శాతానికి చేర్చిన సంగతి తెలిసిందే.

ఈ నెల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర లీటరుకు రూ.5, డీజిల్ రూ.3, వంటగ్యాసు సిలిండర్ ధర రూ.50 పెంచింది. ప్రభుత్వం పెట్రో ధరల ధరల పెంపు ప్రభావం ద్రవ్యోల్బణంపై స్వల్పంగానే ఉంటుందని అంచనా వేసింది. అయితే ఈ ధరల పెంపు, ఆహార పదార్థాలు ధరలు ద్రవ్యోల్బణంపై అనూహ్య ప్రభావం చూపాయి. కేంద్ర ఆర్థిక శాఖకు, రిజర్వు బ్యాంకుకు ప్రధాన సవాలుగా మారిన ద్రవ్యోల్బణం తాజా వివరాలను ప్రభుత్వం ప్రకటించిన కొన్ని నిమిషాల్లోనే బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ 200 పాయింట్లకుపైగా పతనమై పెట్టుబడిదారుల్లో ఆందోళన రేకెత్తించింది. ద్రవ్యోల్బణం ఇంతకుముందు వారాంతానికి (మే 31) 8.75 శాతం వద్ద ఉంది.  


User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...
  వీడియోస్
  మరిన్ని వార్తలు