clear
clear
clear
clear
x

‘మగధీర’ 100 డేస్ కి ‘స్టార్ నైట్’ అడ్డంకి అవుతుందా?

  శుక్రవారం, నవంబర్ 6, 2009, 16:59[IST]
Vote this article
Up  
Down  


ఒకటి, రెండు, మూడు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఈ నెల 7న జరగనున్న ‘స్టార్ నైట్’ ప్రోగ్రామ్ కి సంబంధించిన కౌంట్ డౌనే ఇది. వరద బాధితుల సహాయార్థం యావత్ చిత్రపరిశ్రమ ఏకమై ఈ కార్యక్రమాన్ని చేయనున్న విషయం విదితమే. ఈ కార్యక్రమం హైదరాబాద్ లో గచ్చిబౌలి స్టేడియంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినది మొదటగా బాలకృష్ణ. ఈ ప్రపోజల్ ని ఆయనే తీసుకోచ్చారు. అనంతరం దాసరిలాంటి పెద్దలు దీనికి ఆమోదం తెలిపి పరిశ్రమకి చెందిన అన్ని శాఖలకి సంబంధించిన ప్రముఖులను ఆహ్వానించి మాట్లాడారు. దీనికి ‘స్పందన’ అని చక్కటి పేరు కూడా పెట్టారు.

ఈ కార్యక్రమంలో తెలుగు సినీరంగానికి సంబంధించిన వారు మాత్రమే కాకుండా తమిళ రంగం వారు కూడా పాల్గొననున్నారు. విరాళాలు కూడా ఇవ్వాలనుకుంటున్నారు. సో మొత్తం 3 నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి రోశయ్య చేతికి ఇవ్వనుంది సినీ పరిశ్రమ. శనివారం 07.11.09 జరగనున్న స్టార్ నైట్ కి ఆ రోజు పెర్ఫామ్ చేయబోయేవారు ప్రస్తుతం రిహార్సల్ చేస్తున్నారు. ఎంతో మంది ప్రేక్షకులు ఎలాగైనా టిక్కెట్లు సాధించి ఈ వేడుకని వీక్షించాలనుకుంటున్నారు. టిక్కెట్ల ధర పెద్ద మొత్తంలో ఉన్నాకూడా అమ్మకం మాత్రం జోరుగా ఉంటుందనే అంచానాలు ఉన్నాయి. మొత్తం చిత్రసీమతో పాటు ఈ వేడుకను వీక్షించే ప్రేక్షకులతో గచ్చిబౌలి ప్రాంగణం నిండతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అలాగే ఇది లైవ్ షో కాబట్టి టీవీల ముందు అతక్కుపోయే జనాలు కూడా చాలామందే ఉంటారు. కానీ ఇది ‘మగధీర’కి మైనస్ అయ్యే అవకాశం ఉంది.

సరిగ్గా నవంబర్ 7 తో చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్, కాజల్ అగర్వాల్ జంటగా రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన ‘మగధీర’ వంద రోజులు పూర్తి చేసుకుంటుంది. ఈ వేడుకని నిర్వహించాలని అల్లు అరవింద్ అనుకుంటున్నారట. అయితే అదే రోజు స్టార్ నైట్ ప్రోగ్రామ్ భారీ ఎత్తున జరగడం వల్ల చిరంజీవి కుటుంబం కూడా అందులో పాల్గొనాల్సి ఉండటం వల్ల? ‘మగధీర’ శతదినోత్సవ వేడుక నిర్వహించలేని పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ‘స్పందన’ వేదిక మీద ఈ వేడుకలు జరిగే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. విడిగా చేస్తే మాత్రం చిరంజీవి నలుగురి నోళ్లల్లో నానే అవకాశం ఉంది. మరి నవంబర్ 7న ఏం జరుగుతుందో వేచి చూద్దాం.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: Ganesh
తేదీ: 07 Nov 2009 1:14 pm
ఎడిటర్ గారు, ఆర్టికల్ రాసే ముందు విషయం తెలుసుకుని వ్రాయడం మంచిది. వందోరోజునే ఎవడు ఫంక్షన్ చేయదు. ౧౦౦ డేస్ ఫినిష్ అయ్యాక చేస్తారు. మీరు నేగితివే గ వ్రాయకండి.

పోస్ట్ చేసినవారు: Abhimaani
తేదీ: 07 Nov 2009 1:08 pm
దాసరి,మోహన్ బాబు మరియు బాలకృష్ణ కావాలనే స్టార్నైట్ పెట్టారు...

[ Post Comments ]
  Other News
  Videos