clear
clear
clear
clear
x

ఆకాశమంత ‘మగధీర’ కి వందకి వంద!!

  శనివారం, నవంబర్ 7, 2009, 13:40[IST]
Vote this article
Up  
Down  


‘బెన్ హార్’ లాంటి సినిమాను డీవీడిల్లో చూస్తున్నప్పుడు హాలీవుడ్ నైపుణ్యం మురిసిపోతారే తప్ప ‘అలాంటి సినిమాను మన తెలుగులో’ కనీసం వూహించే సాహపానికి పూనుకోరు మన తెలుగు ప్రేక్షకులు. ‘గ్లాడియేటర్’ వీరోచిత సాహసాలు చూసి ఎగిరి గంతేస్తారే తప్ప అలా మన కథానాయకుడూ చేయాలని కల్లో కూడా అనుకోరు. మన తెలుగు సినిమా పరిధి ఏమిటో ప్రేక్షకులకు బాగా తెలుసు కాబట్టి, ఈ పరిధులు దాటుకుని ఆ హద్దుల్ని చెరిపేసి ఓ అందమైన అద్భుతాన్ని తెర మీద ఆవిష్కిరించిన చిత్రం ‘మగధీర’. 24 విభాగాల సమిష్టి కృషికి అద్దం పట్టి ప్రేక్షకుల్ని అలరించి భారీ వసూళ్లను మూటగట్టుకొంది. శనివారం నాటికి అల్లు అరవింద్ నిర్మించిన ‘మగధీర’ విడుదలై వంద రోజులు పూర్తవుతుంది. ‘మగధీర’ సినిమాలో చరణ్ ‘భలే చేశాడు’ అని చిరంజీవి అభిమానులు కితాబులివ్వొచ్చు. ‘కాజల్ నిజంగా యువరాణిలా ఉంది’ అని అందాన్ని ఆరాదించేవాళ్ళు పొగడొచ్చు. అరవింద్ కోరుకున్నట్లుగానే అందరి మతీపోయేలా ‘మెగా బ్లాస్ట్’ ని ఇచ్చాడు రాజమౌళి. 302 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం, 223 కేంద్రాల్లో శతదినోత్పవం జరుపుకుంది. ఈ రోజు(శనివారం) ‘మగధీర’కు నూరవరోజు. సినిమా భాషలో శతదినోత్సవం!ఇంత ఘనవిజయం వెనుక రాజమౌళి ప్రధాన మాంత్రికుడుగా నిలిచారు. రూ.40 కోట్లు పెట్టి సినిమా నిర్మిస్తున్నప్పుడు వేలెత్తి చూపినవారు ఎందరో...! ఈ రోజు రాజమౌళి సాహసాన్ని మెచ్చుకుంటున్నవారు ఎందరెందరో!! ఇంత డబ్బు పెట్టడానికి సాహసించిన అల్లు అరవింద్ ని అభినందిచనివారు ఉండనే ఉండరు.

ఇక రామ్ చరణ్ ఇమేజ్ ఇప్పుడు ఎంత? అని ప్రశ్నించుకుంటే ‘ఆకాశమంత’ అని బదులిచ్చే అభిమాన జనం ఆయన వెంట ఉన్నారు. ఇప్పటి వరకూ హాలీవుడ్ లో ‘బెన్ హార్’ ని చెప్పుకున్నట్టే ఇక తెలుగులో ‘మగధీర’ని ఓ ల్యాండ్ మార్క్ గా ఉదహరించుకోవలసిన పరిణామం ఇది. లెక్కలపరంగా లిఖించుకుంటే ‘తెలుగు సినిమా పండగ’ ఇది అని ముదావహంగా మెచ్చుకోవలసిన సందర్బంగా సంబరం...కూడానూ!



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: గని
తేదీ: 09 Nov 2009 4:56 pm
బాబు కుమార్ వరసులన్నాక ఎవరికైనా వాళ్ళ తండ్రులను చూసే చాన్స్ ఇస్తారు. తరువాత వీళ్ళు నిరూపించుకోవాలి. jr.ntr, mahesh, naga chaitanya, వీళ్ళందరికీ తండ్రులను చూసే ఇచ్చారు, తరువాత వీళ్ళు నిరుపించుకున్నారు. చరణ్ ఇప్పుడు నిరూపించుకున్నాడు.

పోస్ట్ చేసినవారు: kumar
తేదీ: 09 Nov 2009 4:06 pm
వాడి మొకం చూసి అ సినిమా తెయలె చిన్రంజీవి మొకం చూసి తీసారు అంతే కాని వాడికి అంహ స్కీన్ ledu

[ Post Comments ]
  Other News
  Videos