clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

చిరుకు దాసరి వాతలు

  గురువారం, మార్చ్ 12, 2009, 17:14[IST]
Dasari Narayana Rao
Vote this article
Up  
Down  


దాసరి ప్రధాన పాత్రలో ఈ రోజు రిలీజైన మేస్త్రి సినిమాలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై ఘాటుగానే సెటైర్స్ పెట్టారు. అందులో విజయ్ కుమార్ పాత్ర ఓ కొత్త పార్టీ పెడుతుంది. వారి ఎజెండా అందరికీ సామాజిక న్యాయం అని ప్రకటిస్తారు. అప్పుడు విలేఖర్లు సామాజిక న్యాయం అంటే ఏమిటీ అని అడుగుతారు. దానికి విజయ్ కుమార్..మేధావులను చర్చకు వేశాం చెప్తాం..అంటూ సమాధానం చెప్తూ నసుగుతాడు. అలాగే మహానుభావులు ఫోటోలు వెనకాల పెట్టుకున్నంత మాత్రాన మనం మహానుభావులం అవుతామా..పెంచుకునే కుక్కకి టైగర్ అనే పేరు పెట్టినంత మాత్రాన కుక్క పులి అవుతుందా అని విమర్శలు చేసారు. అలాగే ఓ చోట విజయ్ కుమార్ పాత్రను మీడియా వ్యక్తులు మీ పార్టీ వారు సీట్ కి కోటిరూపాయలు చొప్పున తీసుకుంటున్నారట కదా అని అడుగుతారు.

దానికి ప్రక్కనున్న షాయేజి షిండే..ఈ విలేఖర్లు సరిగ్గా ఏమీ తెలుసుకోరు..ఎమ్మల్యేకి ఐదు కోట్లు,ఎంపికి మూడు కోట్లు తీసుకుంటున్నాం అంటాడు. అలాగే మరో చోట విజయ్ కుమార్ ని పార్టీ ప్రతినిధులు(అభిమానులు) కొందరు ఏంటి సీట్లు అన్నీ రియల్ ఎస్టేట్ వారికీ, గూండాలకి, వెధవలకీ ఇచ్చారంటూ నిలదీస్తారు. దానికి విజయ్ కుమార్..మనం పార్టీ పెట్టిందే డబ్బు కోసం అన్నట్లు చెబుతూ మీ నెత్తి మీద రూపాయి పెడితే పావలా కి కూడా ఎరవూ కొనరు..మీమీద నాలుగైదు కోట్లు ఖర్చుపెట్టి గెలిపించుకోవాల్సిన పని ఏముంది అంటాడు. అప్పుడు వాళ్ళు ఇన్నాళ్లూ మీ వెనక ఉన్నాం అంటే..దానికి నేను గొప్పవాడ్ని అయ్యాక మీరంతా చేరారంటూ హేళన చేసి గెంటించేస్తాడు.అలాగే విజయ్ కుమార్ చేత మరో చోట నా వెనుక కుల బలం ఉందంటూ చెప్పించారు.

అంతేగాక ఓ వికలాంగుడు పాత్రను పెట్టి అతని చేతే పార్టీ ఓపినింగ్ రోజున జై కొట్టించుకుని ఆ తర్వత తరిమేస్తాడు. ఆ తర్వాత ఆ వికలాంగుడే విజయ్ కుమార్ హత్య చేస్తాడు. ఈ సన్నివేశాల్లో వికలాంగుడుని చూస్తుంటే..ప్రజారాజ్యం పార్టీ ప్రారంభంలో వికలాంగుడు కు పార్టీ సభ్యత్వం ఇవ్వటం అందరికీ గుర్తు రావటం ఖాయం. వీటన్నిటికీ తోడు రోడ్ షో లపై సెటైర్ చేస్తూ..అభిమానులు సినీ హీరోల మోజులో పడి తమ జీవితం నాశనం చేసుకుంటున్నారంటూ పాట సైతం పెట్టారు. ఇక మొదట ఈ సినిమాలో పాత్రలు ఎవరినీ పోలి ఉండవని, పోలిక తేవద్దని చెప్తూ ప్రారంభించారు. అయితే సినిమాలో చాలా సెటైర్స్ చిరు పార్టీనే ఉద్దేశించి పెట్టారని సామాన్య ప్రేక్షకుడుకి సైతం అర్ధమవుతాయి.



dasari narayana rao mestri chiranjeevi దాసరి..రాజశేఖర్ కలసి'మేస్త్రి'లో దాసరి పాత్ర అదే?అంతా ఉచితం..సొంత అబ్బ సొమ్మా?దాసరిపై పవన్ గన్? అంతా ఉచితం..సొంత అబ్బ సొమ్మా?చిరుని దాసరి దుమ్మెత్తి పోసారా?చిరుకు దాసరి వాతలుమేస్త్రి చిరంజీవి, కూలి దాసరి(రివ్యూ) ఠాగూర్‌..బాగుందిఅంజి- గ్రాఫిక్స్‌ మాయాజాలంభక్తిరస గుళిక శ్రీ మంజునాథప్రేక్షకులను ఆనందపరిచే శంకర్‌దాదా Related newsదాసరికి ఎన్టీఆర్ అవార్డు'మేస్త్రి'లో దాసరి పాత్ర అదే?లారన్స్ తో రామ్ చరణ్ !!
User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...