clear
clear
clear
clear
x
హోంపేజి »  సినిమా » తెరచాటు » పూర్తి కథ

త్రిష ఆ మాయలో పడి వ్యాల్యూ పోగొట్టుకొంటోంది?

  శుక్రవారం, నవంబర్ 6, 2009, 12:29[IST]
Vote this article
Up  
Down  


బాలీవుడ్ లోకి అడుగు పెట్టిందో లేదో త్రిష మారిపోయింది అంటే....ఆకారంలో అన్న మాట! జీరో ప్యాక్ కు ప్రతీకగా నిలిచిన కరీనాకపూర్ ను ఇన్ స్పిరేషన్ గా తీసుకుంది. జీరో ప్యాక్ కోసం కసరత్తు మొదలు పెట్టిందంట! ‘వర్షం’ మొదలు నిన్నటి శంఖం వరకు ఒకే రకమైన పర్పనాలిటిని మెయిన్ టైన్ చేస్తూ వస్తూ వచ్చిన త్రిషకు ‘జీరో’ ప్యాక్ పై గాలి మళ్లింది. జీరో ప్యాక్ లేకపోతే బాలీవుడ్ పీపుల్ చూడమన్నారో లేక సినిమాల్లో అవకాశాలు రావట్లేదో మరి!

కరెక్ట పర్సనాలిటి ఉన్న త్రిష ఇంకా సన్నబడితే బాగుంటుందా అన్న డౌట్ ఇప్పటికే చాలా మందికి వచ్చింది. జీరో ప్యాక్ మోజులో పడి నయనతార, తమన్న, శ్రియ, తమ ముఖంలో కళ లేకుండా చేసుకున్నారన్న విమర్శ ఉంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్న ‘కట్టా మీటా’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాతో పాటు తెలుగులో ఎన్టీఆర్ సరసన ‘బృందావనం’లో నటిస్తోంది. మరి ఈ జీరో ప్యాక్ ప్రభావం బృందావనంపైన కూడా పడడం ఖాయం. జీరో ప్యాక్ మాయలోపడి పేస్ వ్యాల్యు పోగొట్టుకోకుండా చూసుకుంటే మంచిది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: ప్రవీణ్ తల్వేద
తేదీ: 06 Nov 2009 5:50 pm
ప్రవీణ్ తల్వేద

[ Post Comments ]
  Other News
  Videos