clear
clear
clear
clear
x
హోంపేజి »  సినిమా » తెరచాటు » పూర్తి కథ

పూరీ, పవన్ కళ్యాణ్ చిత్రం ఆగటానికి కారణం?

  బుదవారం, నవంబర్ 4, 2009, 19:13[IST]
Vote this article
Up  
Down  


పూరీ జగన్నాద్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో హాస్య నటుడు గణేష్ చిత్రాన్ని ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గణేష్ ..తాను హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చిత్రాన్ని నిర్మిస్తున్నానని మీడీయాతో చెప్పారు. అయితే ఈ నిర్ణయం వెనక పవన్ ఆలోచన ఉందంటున్నారు. వరస పరాజయాలతో వెళ్థున్న పూరీకి తన ప్రాజెక్టును అప్పచెప్పటం ఎంత వరకూ సమంజసం అనే ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు. అయితే అదేం కాదు..పూరీ తన మిత్రుడు హరీష్ శంకర్ కి ఈ చిత్రం డైరక్షన్ ఛాన్స్ ఇవ్వమని పవన్ కి చెప్పటంతో ఈ ప్రాజెక్టు మూవ్ అవుతోందని మరికొందరంటున్నారు. ఇంతకుముందు హరీష్ శంకర్ ..ఎన్టీఆర్ హీరోగా ఎమ్మల్యే అనే చిత్రాన్ని రూపొందిస్తారని,దానికి నల్లమలుపు బుజ్జి నిర్మాతగా ఉంటారని అన్నారు. అయితే ఎన్టీఆర్..శక్తి, బృందావనం చిత్రాల తర్వాత కానీ డేట్స్ సర్దుబాటు చేసే అవకాశం లేకపోవటంతో ఈ ప్రాజెక్టుకు హరీష్ శంకర్ మారాడంటున్నారు. ఇక షాక్ తర్వాత హరీష్ రూపొందిస్తున్న చిత్రం ఇదే. గణేష్ కూడా ఆంజనేయులు చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం కూడా ఇదే. ఈ రెండు చిత్రాల లోనూ రవితేజే హీరో. ఇక పవన్ కళ్యాణ్ చేస్తున్న పులి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.



User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  Other News
  Videos