రాజమౌళి, ప్రబాస్ కాంబినేషన్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం విశ్వామిత్రడు కథే అని తెలుస్తోంది. ఈ మేరకు విజయేంద్రప్రసాద్ తన అసోసియోట్స్ తో కలిసి స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు సమాచారం. మొదట ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు తెరకెక్కిస్తారని,భారవి కథ అందిస్తారని వినపడింది. అయితే మగధీర చూసిన రాఘవేంద్రుడు..ఈ ప్రాజెక్టు ను రాజమౌళితో చేయటానికే నిర్ఛయించుకున్నారని పిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఇక రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో గతంలో ఛత్రపతి హిట్టు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అంతకు మించిన హిట్టు అయ్యే సబ్జెక్టు కావాలని,అలాగే మగధీర కు మించిన గ్రాఫిక్స్ తో ముందుకు రావాలని రాజమౌళి అనుకుంటున్నారుట.
ప్రస్తుతం ప్రభాస్..బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా కోసం ప్రభాస్ స్విట్జర్లాండ్‌లో ఉన్నారు. కరుణాకరన్ దర్శకుడు. చక్కటి ప్రేమ కథ ఇది చెప్తున్నారు. డార్లింగ్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి నిర్ణయించారు. అలాగే ఓ నెల రోజుల్లో ప్రభాస్ హీరోగా దిల్ రాజు నిర్మించే సినిమా మొదలవుతుంది. దశరథ్ దర్శకుడు. ఇదీ ప్రేమతో ముడిపడ్డ కుటుంబ కథే అని చెప్తున్నారు.ఇక ప్రభాస్ హీరోగా చేసిన ఏక్ నిరంజన్ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.రాజమౌళి ప్రస్తుతం సునీల్ హీరోగా మర్యాద రామన్న అనే కామిడీని తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు.
మరిన్ని వివరములు:
రాజమౌళి
రాఘవేంద్రరావు
డార్లింగ్
సంబంధిత వార్తలు