పవన్ కళ్యాణ్, పరిటాల రవి మధ్య జరిగిన ఇష్యూ, ఆ తర్వాత అది ఓ పాపులర్ దినపత్రికలో వస్తే గొడవ కావటం తెలిసిందే. అయితే రామ్ గోపాల్ వర్మ తాజాగా పరిటాల రవి జీవిత చరిత్రను రక్త చరిత్ర పేరుతో తెరకెక్కిస్తున్న నేపధ్యంలో మర్ఛిపోయిన ఈ సంఘటన మళ్ళీ తెరపైకి వచ్చింది. ఫిల్మ్ వర్గాల్లో కాక బయిట కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సంఘటనను రక్త చరిత్రలో వర్మ చూపెడతాడా అని చర్చిస్తున్నారు. అంత సాహసానికి వర్మ ఒడి కట్టడని, కేవలం ఫ్యాక్షన్ రాజకీయాలు,హత్య జరిగిన తీరుపైనే కేంద్రీకరిస్తారని ఓ వర్గం అంటోంది. అయితే వర్మ సెన్సేషన్ కోసం ఏదైనా చేస్తాడని ఈ సంఘటన గ్యారెంటీగా స్క్రిప్టులో ఉంటుందని మరికొందరు అంటున్నారు. ఏది నిజమో తెలియాలంటే రక్త చరిత్ర బయిటపడేదాకా వెయిట్ చేయాల్సిందే.
మరిన్ని వివరములు:
పవన్ కళ్యాణ్
పరిటాల రవి
పులి
సంబంధిత వార్తలు