clear
clear
clear
clear
x
హోంపేజి »  సినిమా » తెరచాటు » పూర్తి కథ

మహేష్ ఆ సినిమాకు నిర్మాత దిల్ రాజు?

  గురువారం, నవంబర్ 5, 2009, 17:40[IST]
Vote this article
Up  
Down  


స్టార్ నిర్మాత దిల్ రాజు,స్టార్ హీరో మహేష్ కాంబినేషన్లో ఇప్పటివరకూ ఏ చిత్రమూ రాలేదు. అయితే ఇప్పుడా కొరత తీర్చటానికా అన్నట్లు ఓ ప్రపోజల్ తో దిల్ రాజు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. రాజమౌళితో మహేష్ చేయనున్న చిత్రానికి దిల్ రాజు నిర్మాత అని వినపడుతోంది. అలాగే ఈ చిత్రం దాదాపు యాభై కోట్ల భారీ బడ్జెట్ తో తీయనున్నట్లు చెప్తున్నారు. టాలీవుడ్ చరిత్రలో ఇప్పటివరకూ ఇలాంటి చిత్రం రాలేదనేంత గొప్ప సినిమా తీయాలని సంకల్పించుకునే ఈ ప్రాజెక్టుతో వస్తున్నారని చెప్తున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం సునీల్ హీరోగా మర్యాద రామన్న చేస్తున్నారు. దిల్ రాజు దాదుపు ముప్పై కోట్ల బడ్జెట్ తో ఎన్టీఆర్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా దీనిని రూపొందించనున్నట్లు సమాచారం. మరో ప్రక్క మహేష్ బాబు తన లేటెస్ట్ ప్రాజెక్టు ఖిలాడీలో బిజీగా ఉన్నారు. దీనిని త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: మహేష్
తేదీ: 06 Nov 2009 10:34 am
తీసే సిన్మాలు అన్నీ మగదిరాలు కావు.. బడ్జెట్ మూవీస్ అన్నీ హిట్ కావాలని లేదు... అంతేకాకుండా రాజమౌళి సినిమాల్లో మగదిర కాకుండా మిగతావన్నీ సూపర్ డూపర్ హిట్ సినిమాలు కాదు...

పోస్ట్ చేసినవారు: గని
తేదీ: 06 Nov 2009 9:33 am
పవన్ సంవత్సరం పాటు సినిమా తీస్తే అభిమానులకు రామ్చరణ్, అల్లు అర్జున్ సినిమా లతో సరిపెట్టుకుంటారు. ntr సంవత్సరం పాటు సినిమా తీస్తే కళ్యాణ్ రామ్ సినిమాలతో సరి పెట్టుకుంటారు. మరి మహేష్ సినిమా సంవత్సరం అయితే. మరి రాజ మౌళి 40 crores budget సినిమా కే సంవత్సరం టైం తీసుకున్నాడు . ఈ సారి 50 కోట్ల తో సినిమా అంటే ఎంత టైం తీసుకుంటాడో. మరి సంవత్సరం కాలం సినిమా లేకుండా అభిమానులు మల్లి వెయిట్ చేయాల్సిందే

[ Post Comments ]
  Other News
  Videos