clear
clear
clear
clear
x
హోంపేజి » వార్తలు » పూర్తి కథ

'ఆర్య' సీక్వెల్ని నేనే వదులుకున్నా

  శుక్రవారం, జూన్ 20, 2008, 19:16[IST]
Tamanna
Vote this article
Up  
Down  


"నన్నేమి వాళ్ళు వద్దనుకోలేదు...నా అంతట నేనే ఆ పాత్రని వదులుకున్నా!" అంటోంది తమన్నా. 'హ్యాపీడేస్' తో పాపులర్ అయిన ఈ బ్యూటీ 'కాళిదాసు' లో హాట్ గా నర్తించి కుర్రాళ్ళ హార్ట్ బీట్ గా మారింది. దాంతో ఆమెను అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందనున్న 'ఆర్య' సీక్వెల్‌లో మొదట అనుకున్నారు. కానీ తర్వాత ఆమె కాదు కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలిసింది. దాంతో తెరవెనుక యేమైందో నని అందరూ రకరకాలుగా అనుకున్నారు. కొందరైతే తమన్నా బదులు కాజల్‌ని తీసుకోవాలన్నది అల్లు అర్జున్ లేదా సుకుమార్‌లలో ఒకరి నిర్ణయమని అంతా అనుకున్నారు.

అయితే నెగిటివ్ గా ప్రచారమవుతున్న ఆ వార్తలు ఆమె చెవిని పడినట్లున్నాయి. దాంతో ఇప్పుడామె ఆ సినిమాను తానే వదలుకున్నానని చెబుతోంది. "ఒకే సమయంలో ఎన్ని సినిమాలని చేయను? ఇప్పటికే రెండు సినిమాల్లో చేస్తున్నా. మరో రెండు సినిమాలు ఒప్పుకున్నా. అందుకే నా డేట్లు అడ్జస్ట్ కావడం కష్టమని నిర్మాతకు సున్నితంగా చెప్పా. వచ్చే యేడాది తప్పకుండా ఒక సినిమా చేస్తానని ఆయనకు హామీ ఇచ్చా. ఆయన నా సమస్యను అర్ధం చేసుకున్నారు" అని తెలిపింది తమన్నా.

ఇటీవలే అక్కినేని మనవడు సుశాంత్ సరసన 'కాళిదాసు'లో గ్లామర్‌తో మెప్పించిన ఆమె మరి కొద్ది రోజుల్లో రవికృష్ణతో 'నిన్న నేడు రేపు' సినిమాలో కనిపించబోతోంది. సిద్ధార్థ్‌తో 'కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా' సినిమా చేస్తోంది. పవన్ కల్యాణ్ 'పులి'లోనూ ఆమె పేరు వినిపిస్తోంది గానీ, ఇంకా ఫైనల్ కాలేదు.యేదైమైనా వరస ఆఫర్స్ తో దూసుకుపోతున్న ఆమె కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.


tamanna happydays allu arjun నయనతారపై బ్యాన్ కి పట్టుపట్టిన డైరక్టర్!!తమన్నా తడి టవల్ జారిన వేళతమన్నా సీక్రెట్ మేటర్స్ (స్పెషల్)తమన్నాకు ఆ కోరిక తీరలేదు తమన్నా తడి టవల్ జారిన వేళనయనతార ప్లేస్ లోకి సోనియా?చివరకు శేఖర కమ్ముల కూడాతమన్నా..ఆనందతాండవంఆర్య - సమీక్షబన్నీ బాగున్నాడుగంగోత్రి..ఖంగోత్రి! అల్లు అర్జున్‌ హ్యాపీ Related newsరొటీన్‌ శ్రీవారస హీరోతో శేఖర్ కమ్మలగమ్యం చేరని 'పరుగు'
User Comments
[ Post comments ]


ఈ ఆర్టికల్ మీద మీరే మొదటి వ్యాఖ్య రాయండి .

  ఇతర వార్తలు
Live Chat with a Doctor
మీ డాక్టర్ ఆన్ లైన్ లో...
  వీడియోస్
  మరిన్ని వార్తలు